ఆనందపురం జాతీయ రహదారి ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో ఆర్మీ ఉద్యోగి అక్కడికక్కడే మృతి
ఆనందపురం: వి న్యూస్ :మే 3
విశాఖ జిల్లా ఆనందపురం జాతీయ రహదారి ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో ఆర్మీ ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు స్థానికుల వివరాలు ప్రకారం భీమునిపట్నం మండలం చిప్పాడ గ్రామానికి చెందిన ఆర్మీ ఉద్యోగి సరగడ భరద్వాజ్ (26) ద్విచక్ర వాహనంపై నగరానికి వెళుతుండగా ఆనందపురం ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద కారు ఢీకొని మృతి చెందాడు. భరద్వాజ్ సుమారు ఏడేళ్ల క్రితం ఆర్మీలో చేరాడు. ఆర్మీ సప్లై కోర్ విభాగంలో సేవలు అందిస్తున్నారు. ఇటీవల ఆర్మీ నుంచి 30 రోజుల సెలవు పై స్వగ్రామానికి చేరుకున్నాడు. నగరంలో వివిధ పనులు నిమిత్తం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కారు మృత్యు రూపంలో వెంబడించింది. విషయం తెలుసుకున్న బంధువులు తల్లిదండ్రులు కన్నీరు అవుతున్నారు. దీంతో గ్రామం విషాదంలో మునిగిపోయింది ఆనందపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్ తరలించారు