ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు*
*కొమ్మాది ,ఎస్టీబీఎల్ ధియేటర్ వద్ద భారీ కేక్ కటింగ్*
*పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన అభిమానులు*
మధురవాడ వి న్యూస్ మే 20 :
నందమూరి కుటుంబం పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ వెలకట్టలేనిది. ఆ కుటుంబం నుంచి వచ్చిన నటులలో అత్యంతగా అభిమానుల మన్ననలు పొందిన నటుడు జూనియర్ ఎన్టీఆర్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు వినగానే అభిమానులు అరిచి గోల చేస్తారు. ఆ పేరుకున్న పవర్ అలాంటిది. నటనలో తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. ఎన్టీఆర్ డాన్స్ కు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. కొన్ని లక్షల హృదయాల్లో ఫెవరెట్ హీరోగా కొలువై ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. 'నాటు నాటు' పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత నుంచి ఎన్టీఆర్ ఒక బ్రాండ్ అయ్యారు.
నేడు తన 40 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.ఈ సందర్బంగా జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురష్కరించుకుని నందమూరి అభిమానులు పలు సేవా కార్యక్రమాలను చేసి అభిమానాన్ని చాటుకొంటున్నారు .విశాఖపట్నంలోని మధురవాడ ,ఎస్టిబిఎల్ ధియేటర్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు . ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన భారీ కేకు కట్ చేసి తమ అభిమాన హీరోకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు . అనంతరం పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు . ఈ కార్యక్రమంలో టీడీపీ విశాఖ పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు గురునాథ్ , విశాఖ జిల్లా టీం తారక్ ట్రస్ట్ అధ్యక్షులు లంక సురేష్ , జిల్లా సెక్రెటరీ ఓలేటి శ్రావణ్ , పృద్వి , సాయి, హరికృష్ణ , భాస్కరరావు, విష్ణు , లకోజి గణేష్ తదితరులు పాల్గొన్నారు.