బాత్ రూమ్ లో అంగన్ వ్వాడి పాలు వైయస్సార్ కిట్లు లభ్యం.
వెదురుపల్లి: వి న్యూస్ : మే 16:
▪️అంగన్ వ్వాడి కు వచ్చిన సామగ్రి నీ అమ్ముకుంటున్న ఆయాలు.
▪️ భారీగా పాల డబ్బాలు, మరియు కిట్లు లభ్యం.
▪️అంగన్ వ్వాడి టీచర్ సెలవు తో భారీగా అంగన్ వాడి కు వచ్చిన సామగ్రి అమ్ముకుంటున్న ఆయాలు.
▪️అనకాపల్లి జిల్లా :నాతవరం మండలం వెదురుపల్లి గ్రామంలో ఉన్న అంగన్ వాడి సెంటర్లో అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందడంతో సిడిపిఓ శ్రీ గౌరీ ఆకస్మికంగా తనిఖీ చేపట్టడం వల్ల అంగన్వాడీ సెంటర్ ఆయాగా చేస్తున్న అంకంరెడ్డి నారాయణమ్మ (అమ్మాజీ) ఆయాగా పనిచేస్తుంది.
ఇక్కడ టీచర్ గా పని చేస్తున్న పారుపల్లి వరలక్ష్మి ఆరోగ్యం బాగోలేక పోవడం వలన గత 45 రోజుల నుంచి సెలవులో ఉంది.
▪️ఇదే అధును గా భావించిన అంగన్వాడీ ఆయా నారాయణమ్మ తన చేతివాటం చూపించడం మొదలు పెట్టింది.
▪️పిల్లలకు ఇవ్వాల్సిన పాలు 14 బాక్సులు సుమారుగా 75 లీటర్ల 600 గ్రాములు మరియు రెండు వైఎస్ఆర్ కిట్లు అంగన్వాడి సెంటర్ కు ప్రక్కన ఉన్న ఇంటి దగ్గర బాత్ రూంమ్ లో పెట్టి తాళాలు వేసి ఉంచింది.
▪️ఫిర్యాదు దారుడు పారుపల్లి సంజీవి సిడిపిఓ ని బాత్రూం దగ్గరకు తీసుకొని వెళ్లి చూపించిన తాళాలు లేవని చాలాసేపు బొకాయించింది.
▪️కొద్దిసేపటి తర్వాత తాళాలు తీసుకొచ్చి తెరిచి చూస్తే అందులో పేద ప్రజలకు పెంచాల్సిన పాలు వైయస్సార్ కి ఇట్లు బియ్యం లభ్యమయ్యాయి టీచర్స్ సెలవుల్లో ఉండటం వలన ఆయా అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది.
▪️ఎన్ని సార్లు కంప్లైంట్ చేసిన పట్టించుకోని అధికారులు .ఎప్పుడు ఇలానే జరుగుతుంది అని పలువురు గ్రామ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.