బ్రేకింగ్ : సస్పెండ్ అయ్యిన ఇద్దరు వైస్సార్సీపీ నాయకులు.
వి న్యూస్ :మే 13 :
ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జీవీఎంసీ పరిధిలో 60 వ వార్డు కార్పొరేటర్ పి.వి.సురేష్ ను, 89 వ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డి కిరణ్ లను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది.