కలెక్టర్ కి చెప్పుకో నాకేంటి..?డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ గసాడ వెంకటరావు
అల్లూరి జిల్లా,వంట్లమామిడి వి న్యూస్ మే 8 :-
విలేఖరి వివరణ అడిగితే సమాధానం ఇదేనా?
డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ గసాడ వెంకటరావు వ్యవహార శైలిపై ఉన్నత అధికారులు దృష్టి సారించి చట్టపరమైన చర్యలు చేపట్టాలి
విలేఖరి భూ వివాదం పై సంబంధిత అధికారికి వివరణ అడిగితే దురుసుగా సమాధానం చెప్పిన సంఘటన సంచలనం రేగితిస్తుంది వివరాల్లోకి వెళితే అల్లూరి జిల్లా, పాడేరు మండలం వంట్లమామిడి పంచాయతీ కేంద్రంలో మే 6వ తారీకు నాడు సర్వే నెంబర్ 5 మరియు 4/2కు సర్వే నిమిత్తం వస్తున్నామని రెవెన్యూ శాఖ వారు మరియు సర్వే డిపార్ట్మెంట్ ఇరు పార్టీలకు నోటీసులు జారీ చేశారు.అయితే ఇక్కడ పూర్తిగా కలెక్టర్ ఆదేశాలు బేకాతరు చేసిన రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు సర్వే డిపార్ట్మెంట్. కలెక్టర్ చెప్పిన విధంగా ఏ ఒక్క విధంగా కూడా వ్యవహరించకపోగా... ఎవరైతే కబ్జాదారుడు(రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి జారీచేసిన నకిలీ పట్టాదారుడు) ఉన్నాడో...ఆరో వార్డ్ మెంబర్ అయిన అల్లంగి కొండలరావుకు మద్దతిస్తూ మీ భూమి సరిహద్దు ఇవి అని చూపిస్తూ....5 సర్వే నెంబర్ లో ఉన్న భూమిని 4/2 భూమి అని నిర్ధారించి ఈ భూమిక మీకే సొంతం అని రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ సర్వేర్ చెప్పుకొచ్చారు.అయితే ఎవరైతే ఫిర్యాదుదారుడు జనపరెడ్డి అప్పారావు అనే రైతు ఉన్నారో వారికి 5 సర్వే నంబర్ లో 2.67 సెంట్లు భూమి కలిగి ఉన్నారు. ఆ భూమి పూర్తి కొలతలు చూపించకపోగా...మేము కొలిచామంటూ తమంత తామే నిర్ణయించుకుంటూ... ఫిర్యాదుదారుడు కి ఎటువంటి హద్దులు చూపించకుండా? భూకబ్జాదారుడుకు పూర్తి మద్దతిచ్చి 5 సర్వే నెంబర్ లో ఉన్న భూమిని 4/2 లో 0.26 సెంట్లు అని చూపిస్తూ. సుమారు 40 సెంట్లు భూమిని 5 సర్వే నంబర్ లో ఉన్న భూమిని చూపించారు.
ఫిర్యాదుదారుడు లేని సమయంలో ఒక స్టేట్మెంట్ రాసుకొని... కబ్జాదారుడైన అల్లంగి కొండలరావుకు వత్తాసు పలుకుతున్న...స్థానిక పంచాయతీ సర్పంచ్ (వైసిపి) పాంగి రాంబాబు, టిడిపి ఎంపిటిసి తోకల ఈశ్వరరావు, మాజీ సర్పంచ్ అరకు రమణ, మరో వేరే గ్రామానికి చెందిన మరో ముగ్గురితో దొంగ సంతకాలు చేయించి.జనపరెడ్డి అప్పారావు ఇచ్చిన ఫిర్యాదుకు వివరణ ఇస్తున్నట్టు స్టేట్మెంట్ రెడీ చేశారు. అయితే తన భూమి చూపించకుండా స్టేట్మెంట్ ఎలా రెడీ చేస్తారని ప్రశ్నించగా? మేము మీ భూమి సరిహద్దులు చూపించాము అని అబద్ధపు మాటలు మాట్లాడి. ఫిర్యాదుదారుడు నా భూమి సరిహద్దులు నాకు చూపించండి అంటూ ఎంత మొరపెట్టుకున్నా...ఏది వినకుండా తమ ఏదైతే అనుకున్నారో ఆ పని చేసుకుని ఇక్కడితో సర్వే అయిపోయిందంటూ వెళ్లిపోయారు.ఇదే విషయంపై విలేకర్ వివరణ కోసం.... డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేర్ గసాడ వెంకట్రావుకు ఫోనులో వివరణ అడగగా మీరు ఎలాగో వార్తలు రాస్తూనే ఉంటారు రాసుకోండి. కలెక్టర్ కి చెప్పిన నాకు ఏమీ పర్లేదు. కలెక్టర్ కూడా నన్ను ఏం చేయలేరు. నేను ఏం చెప్పుకోవాలో అది చెప్పుకుంటా అంటూ దురుసుగా విలేఖరితో ప్రవర్తించారు.ఈ సంఘటనలను చూస్తుంటే రెవెన్యూ శాఖ మరియు సర్వే డిపార్ట్మెంట్,స్థానికంగా ఉన్న కొంతమంది ప్రజాప్రతినిధులు పూర్తిగా కబ్జాదారుడైనటువంటి ఆరో వార్డ్ మెంబర్ అల్లంగి కొండలరావుకు పూర్తిగా మద్దతు ఇస్తున్నట్టు తెలుస్తుందని పలువురు అంటున్నారు. కాగా ఒక జిల్లా మెజిస్ట్రేట్ అయిన జిల్లా కలెక్టర్ కు...కలెక్టర్ కూడా నాకు ఏమి చేయలేరు అంటూ దురుసగా ప్రవర్తించిన డిప్యూటీ ఆఫ్ సర్వేర్ గసాడ వెంకటరావు వ్యవహార శైలిపై పలు మీడియా సంఘాలు తప్పు పడుతున్నాయి. ఓ విలేఖరి భూ వివాదం పై వివరణ అడగగా దురుసుగా సమాధానం ఇచ్చిన దానిపై పలు మీడియా సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి దీనిపై వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.