తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను ముప్పు..!

సైక్లోన్ మోచ : ముంచుకొస్తున్న 'మోచా'.. తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను ముప్పు..!

దిల్లీ: వి న్యూస్ : మే 5:

దిల్లీ: అకాల వర్షాలతో అల్లాడిపోతున్న రైతన్నలకు మరో పిడుగులాంటి వార్త. వచ్చే వారంలో తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను (cyclone) ముప్పు పొంచి ఉంది..

ఆగ్నేయ బంగాళాఖాతం (Bay of Bengal)లో తుపాను బలపడే అవకాశాలున్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మత్య్సకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది. (Cyclone Mocha)

దిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో భారత వాతావరణ శాఖ (IMD) డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహపాత్ర ఈ వివరాలను వెల్లడించారు. ''మే 6 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశముంది. ఆ మరుసటి రోజు అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత ఇది తీవ్ర అల్పపీడనంగా కేంద్రీకృతమై మే 9వ తేదీ నాటికి తుపానుగా బలపడే అవకాశముంది. ఈ తుపాను cyclone) ఉత్తర దిశగా కదులుతూ మరింత తీవ్రమయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది'' అని ఆయన తెలిపారు..