అల్లూరి వ్యక్తి కాదు సంఘటిత శక్తి

అల్లూరి వ్యక్తి కాదు సంఘటిత శక్తి

విశాఖ : వి న్యూస్ : మే 07: 

ఆంధ్ర విశ్వ కళాపరిషత్ తెలుగు విభాగం ,సంగీత నృత్య శాఖలు మరియు సమైక్య భారతి సంయుక్త ఆద్వర్యం లో అల్లూరి శతవర్ధంతి కార్యక్రమాలు          

బీచ్ రోడ్ లో స్వాతంత్ర్య సమరయోధుల మైదానం లో

ఘనంగా నిర్వహించబడ్డాయి.ముందుగా అతిథులు అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం డా యం విజయగోపాల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రెక్టార్ సీనియర్ ఆచార్యులు పి వరప్రసాదమూర్తి గారు ప్రసంగిస్తూ అల్లూరి సీతరామరాజు శతవర్ధంతిని విశాఖలో జరపటం సముచితంగా ఉందన్నారు.మనందరం ఈ రోజు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామంటే ఎందరో త్యాగధనుల పుణ్యఫలమేనన్నారు.ఎంతకాలం మనం జీవించామనేది ముఖ్యంకాదని తాను జీవించిన కాలంలో సమాజానికి ఏమిచేసామన్నదే ముఖ్యమని అటువంటి జీవితాన్ని ఆదర్శప్రాయంగా చూపి తన జీవితాన్ని ప్రజలకోసం త్యాగం చేసిన అతికొద్దిమందిలో అల్లూరి ఒకరన్నారు.ఆయన ఒక వ్యక్తి గాదని సంఘటిత శక్తి అని కొనియాడారు.విస్తృత ప్రాంతాలు సందర్శించిన అల్లూరి ప్రజల కష్టసుఖాలను అతి దగ్గర నుండి చూసి చలించారని వారి బాధలకు కారణం బ్రిటిష్ వారి దౌర్జన్యాలను తెలుసుకొని వారిని సంఘటిత పరచి సాయుధ పోరాటం ద్వారా బ్రిటిష్ వారిని ఏదుర్కొని వారికి నిద్రహారాలు లేకుండా చేసారన్నారు.అల్లూరి పట్టుకోవటానికి బ్రిటిష్ వారు ప్రత్యేక అధికారిని నియమించటమే గాకుండా మన్యంలో రహదారులు నిర్మించి ప్రజలకు అనేక ఆశలు చూపినా వారు లెక్కచేయలేదన్నారు.ప్రజలలో జాతీయతాభావాన్ని,భాషా సంస్కృతి,సంప్రదా

యాలను పాదుగొల్పటం కోసం వారితో మమేకమై దీపంలా వెలిగిన అగ్గి బావుటా అల్లూరి అని కొనియాడారు.సీతారామరాజు బహుబాషా కోవిదుడని,అస్తసాముద్రిక నిపుణుడని,ఆయుర్యేదవైద్యం ద్వారా ఆదివాసీలకు ఎనలేని సేవచేసిన వ్యక్తిని ఆయన జీవిత చరిత్రను నేటి యువత తెలుసుకోవాలన్నారు.

తన చుట్టూ జరుగుతున్న అన్యాయాలను,అకృత్యాలను,దౌర్జన్యాలను ఎదురించడానికి బ్రిటిష్ పై ఎడతెగక పోరుసల్పి ఆ పోరాటంలో అసువులు బాసిన అల్లూరి చిరస్మరణీయుడన్నారు. బహుజనుల జీవితాల కోసం తన జీవితాన్ని ధారపోసిన నిస్వార్ధజీవి అల్లూరి అన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీ రాయల సుబ్బారావు,ఆచార్య జి యోహాన్ బాబు,ఆచార్య ఏ అనురాధ,ఆచార్య సి మంజులత,డా బూసి వెంకటస్వామి,ఆచార్య వెలమల సిమ్మన్న, సమైక్య భారతి జాతీయ సమన్వయకర్త శ్రీ పి కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.సమావేశానంతరం సంగీత నృత్య విభాగ విద్యార్ధులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.