శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద చలివేంద్రం లో చల్లని మజ్జిగ పంపిణీ!
మధురవాడ వి న్యూస్
తగరపువలస వాస్తవ్యులు బడిగింటి సందీప్ గారి ఆర్థిక ధన సహాయంతో విశాఖపట్నం మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గత నెలన్నర రోజులు క్రిందట ఏర్పాటు చేసిన చలివేంద్రంలో 6వ సారి మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది, ఆదివారం తగరపువలస వాస్తవ్యులు బడిగింటి సందీప్ ధన సహాయంతో ఏర్పాటు చేయడం జరిగింది,
ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి కార్పోరేషన్ డైరెక్టర్ తమ్మిన రామలక్ష్మణ్, పద్మశాలి ఆత్మీయ సేవా సంఘం అధ్యక్షులు కె.వి.నాగేశ్వరరావు, ఆలయ కమిటీ అధ్యక్షులు పిళ్లా సూరిబాబు తదితరులు ప్రారంభించారు.ఈకార్యక్రమంలో ఆలయ కమిటీ సెక్రటరీ నాగోతి తాతారావు, కమిటీ సభ్యులు బంక వాసు పోతిన పైడిరాజు పిళ్లా వెంకటరమణ, ముఖ్య సభ్యులు పిళ్లా రాము, పద్మశాలి సేవా సంఘం సభ్యులు పి.నాగేశ్వరరావు, పి.రామస్వామి, రామ్. నర్సింగరావు యస్.గణేష్, యు.శ్రీనివాస్, కె.శ్రీరాములు, యమ్.శ్రీహరి టి వెంకట అప్పారావు, తదితరులు పాల్గొన్నారు. వేసవిలో రోజు రోజుకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వలన ఎండతో ప్రయాణం చేసేవారు వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు చలివేంద్రంలో 6వ సారి ఈరోజు ఆదివారం చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది, జాతీయ రహదారి, సర్వీస్ రోడ్డు పై ప్రయాణం చేసిన వాహనదారులకు, అమ్మవారి ఆలయానికి విచ్చేసిన భక్తులకు, దారిన పోయే బాటసారులకు పంపిణీ చేయడం జరిగింది,