జిల్లా కలెక్టర్ ఆదేశాలను కూడా బేకాతర చేసిన రెవెన్యూ శాఖ మరియు సర్వే డిపార్ట్మెంట్

జిల్లా కలెక్టర్ ఆదేశాలను కూడా బేకాతర చేసిన రెవెన్యూ శాఖ మరియు సర్వే డిపార్ట్మెంట్

అల్లూరి జిల్లా,వంట్లమామిడి పెన్ షాట్ న్యూస్ మే 6:-

రెండున్నర సంవత్సరాల నుండి న్యాయం కోసం ఫిర్యాదులు విన్నవించుకున్న నకిలీ పట్టాదారుడు కే న్యాయం చేస్తున్న రెవెన్యూ శాఖ

అల్లూరి జిల్లా, పాడేరు మండలం, వంట్లమామిడి గ్రామంలో భూ కబ్జాలకు తావులేక పోతుంది... దీనితోపాటు రెవెన్యూ శాఖ మరి కొంతమంది ప్రజాప్రతినిధులు అండతో  వంట్ల మామిడి గ్రామంలో భూకబ్జాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. గత రెండున్నర సంవత్సరాల నుండి వంట్లమామిడి గ్రామంలో జనపరెడ్డి అప్పారావు  అనే రైతు తన భూమికోసం  పోరాడుతున్న సంగతి తెలిసిందే.ఇదే తరుణంలో తన బాధ ఎంతమంది రెవెన్యూ శాఖ అధికారులకు విన్నవించుకున్న స్పందన లో ఉమ్మడి విశాఖ జిల్లా ఉన్నప్పుడు నుండి ఇప్పటివరకు  ఎన్ని అర్జీలు నమోదు చేసిన ఇప్పటివరకు ఆ రైతుకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఎన్ని ఫిర్యాదులు పెట్టిన అధికారులు స్పందించకపోవడంతో...  నూతన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు ఆ రైతు  కలిసి తన బాధ వినిపించుకున్నారు. అయితే కలెక్టర్ తన బాధ విని సానుకూలంగా స్పందించి ఏదైతే తన భూమి ఉందో ఆ భూమి సర్వే చేసి ఆ రైతుకు ఇప్పించాలని కలెక్టర్,రెవెన్యూ శాఖకు  ఆదేశాలు  జారీ చేశారు. అయితే ఇక్కడ అసలు కథ మొదలైంది...  రెవెన్యూ శాఖ ఆ రైతుకు నోటీసులు పంపిస్తూ మే 6న తమ భూమి కొలవటానికి వస్తున్నామని చెప్పి నోటీసులు జారీ చేశారు. అయితే ఏదైతే  జనపరెడ్డి అప్పారావు అనే రైతు కు 5 సర్వేనెంబర్ లో 2.67 సెంట్లు విస్తీర్ణం కలిగి ఉన్నారో....ఆ భూమిపై రెవెన్యూ శాఖ సర్వేయర్లు  2021 జూన్ 3న  ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా డూప్లికేట్ పట్టాదారుడైన ఆరో వార్డ్ మెంబర్ అయినా అల్లంగి కొండలరావుకు ఇది తమ భూమి అని 4/2 సర్వేనెంబర్ అని సుమారు 40 సెంట్లు వరకు చూపించి ఉన్నారు. గత పూర్వం ఇదే సర్వే నెంబరు తో ఓండ్రు కొండలరావు అనే వ్యక్తి జనపరెడ్డి అప్పారావు సరి  హద్దుగా ఉన్నారని ఆ రైతు చెప్పుకొచ్చారు. 2020 వరకు ఓండ్రు  కొండలరావు అనే  వ్యక్తి రెవిన్యూ రికార్డ్స్ లో ఉండగా...మరి 2021 లో ఇతను ఎలా 4/2 సరిహద్దుడైన తనకు తెలియకుండా భూమి కొనుగోలు చేసి రెవెన్యూ రికార్డులో చేర్చారని ఆ రైతు ప్రశ్నిస్తున్నారు? ఇదే విషయంపై పంచాయతీ తో పాటు ఉన్నత అధికారి సీసీఎల్ఏ మరియు రాజభవన్ వరకు వెళ్లిన  తనకు ఎటువంటి వివరణ రెవిన్యూ వాళ్ళు ఇవ్వలేదని ఆ రైతు చెప్పుకొచ్చారు.

పూర్తి వివరాల్లోకి వెళితే...మే ఆరో తారీఖున రెవెన్యూ శాఖ వారు  ఇరు పార్టీలకు నోటీసులు జారీ చేసి ఉన్నారు.కానీ 5 సర్వే నంబర్ సరిహద్దులతోపాటు 4/2 సరిహద్దులు సర్వే నంబర్లు కూడా  నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఆ సర్వే నంబర్లో ఉన్న సరిహద్దులు వారికి ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా... నాలుగో సర్వే నంబర్లు చాలావరకు సబ్ డివిజన్స్ ఉండగా 4/2 సర్వేలో నిర్వహిస్తున్నామని చెప్పి ఐదో నెంబర్ కు ఉన్న భూమిపై  కొలవడం జరిగింది. సుమారు 40 సెంట్లు వరకు ఐదో సర్వే నెంబర్లు లో ఉన్న భూమిని కొలవడం జరిగింది. ఎవరైతే డిప్యూటీ ఇన్స్పెక్టర్ తోపాటు రెవెన్యూ శాఖ సర్వేలు ఇంత వ్యవహారం చేసిందే కాక 5 సర్వే నెంబర్ ఎఫ్ఎంబి మ్యాప్ ప్రకారంగా కొలవడం జరగలేదు మరియు సర్వే రూల్స్ ప్రకారంగా గెస్ లైన్ కూడా చూపించలేదు అని ఆ రైతు చెప్పుకొచ్చారు.  ఐదో సర్వే నెంబర్ లో ఉన్న భూమి  2.67 సెంట్లు అయితే దీనికి పూర్తి విస్తరణ చూపించకపోగా పక్కన సరిహద్దుల్లో ఎవరున్నారో  ఆ రైతుకు తెలియపరచలేదు. దీనితోపాటు ఎవరైతే  4/2 సరిహద్దులు లో ఎవరున్నారు  వారికి కూడా చెప్పలేదు... ఏదైతే 4/2 సర్వే నెంబర్లో 26 సెంట్లు  కలిగి ఉంది... ఆ సర్వే నంబర్లు  ప్రభుత్వం కేటాయించిన బల్క్ మిల్క్ సెంటర్  సుమారు 5 సెంట్లు విస్తరణలో  కట్టి ఉన్నారు అని ఆ రైతు ఎవరైతే సర్వే చేయడానికి (డిప్యూటీ ఇన్స్పెక్టర్ తో పాటు  రెవెన్యూ సర్వేర్లు) చెప్పడం జరిగింది.  ఇదివరకు రెవెన్యూ శాఖ జారీ చేసిన  పోసిషన్ సర్టిఫికెట్ ఉన్నప్పటికీ ఆ సర్టిఫికెట్ నకిలీ అని డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్వేయర్  ఆ రైతు  కు దురుసుగా చెప్పడం జరిగింది.అయితే ఏదైతే బల్క్ మిల్క్  సెంటర్ కేటాయించారు. ఆ ఐదు సెంట్లు మినహాయించి  మిగతా విస్తరణ కొలవాలని కలెక్టర్ చెప్పి ఉన్నారు.కానీ ఆ భూమి కాకుండా... డైరెక్టుగా ఐదో సర్వే నెంబర్లకు వచ్చి 4/2 మీకు ఈ విస్తీర్ణం ఉందని ఆ కబ్జాదారుడికి డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్వేర్ వారు  చెప్పడంతోపాటు మీరే సాగు చేసుకోవచ్చని నోటిమాట ద్వారా చెప్పుకొచ్చారు.కానీ ఎటువంటి సర్వే రిపోర్ట్ ఇరు పార్టీల తో పాటు  కలెక్టర్ కు  వారికి జారీ చేయలేదు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్వేయర్ చెప్పడంతో ఎవరైతే డూప్లికేట్ డాక్యుమెంట్ దారుడైన  ఆరో వార్డ్ మెంబర్ అల్లంగి కొండలరావు  అనే వ్యక్తి ఆ

5 సర్వే నెంబర్ భూమిపై ఉన్న తుప్పలు నరకడం జరిగింది.

ఇదే విషయం పై ఆ రైతు ఎవరైతే డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్వేయర్ నోటి మాటతో  మీరు సాగు చేసుకోవచ్చు అని  డూప్లికేట్ డాక్యుమెంట్ ఉన్న అల్లంగి కొండలరావు కు చెప్పి ఉన్నారో ఆ అధికారిపై చర్యలతో పాటు  డూప్లికేట్ డాక్యుమెంట్ దారుడైన అల్లంగి కొండలరావుకు... సీసీఎల్ఏ మరియు రాజ్ భవన్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పూర్తి ఎంక్వయిరీ జరిగేటట్లు చూడాలని కలెక్టర్ కు  ఆ రైతు వాపోయారు.