మహోజ్వల శక్తి అల్లూరి సీతారామరాజు...!
వర్ధంతి సభలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు
భీమిలి: వి న్యూస్ :మే 07 :
భారత స్వాతంత్ర్య చరిత్రలో బ్రిటీష్ వారిపై నిర్విరామంగా పోరాటం చేసిన మహోజ్వల శక్తి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పెందుర్తి నియోజకవర్గం పరిశీలకులు గంటా నూకరాజు అన్నారు.
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 100వ వర్ధంతి సందర్బంగా మూడవ వార్డు తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ముందుగా గంటా నూకరాజు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ చురకల రమణ సంయుక్తంగా అల్లూరి సీతారామరాజు నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా గంటా నూకరాజు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు 4 జులై 1897 న పద్మనాభం మండలం పాండ్రంగిలో జన్మించారని అన్నారు. విద్యాభ్యాసం విశాఖపట్నం ఏవిఎన్ కళాశాలలో జరిగిందని అన్నారు అప్పటికే ఆంగ్లేయులు భారత దేశాన్ని ఆక్రమించడం, భారతీయులను హింసించడం చేస్తుండేవారని అన్నారు. దేశ సంపదను దోచుకోవడమే కాకుండా భారతీయులపై ఎన్నో ఆంక్షలు పెట్టి వేధింపులకు గురించేయడం లాంటి దురాఘతాలకు పాల్పడే వారని అన్నారు. ఇది నచ్చక అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారిపై తన అనుచరగణంతో పోరాటానికి సిద్దపడ్డారని చెప్పారు. సీతారామరాజు చేసిన పోరాటాలలో సాయుద పోరాటం భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక మైలు రాయని, ఒక ప్రత్యేక అధ్యాయం అని చెప్పారు. సాయిద పోరాటం ద్వారానే వారికి సరైన బుద్ది చెప్పగలమని నమ్మి ఆవిధంగా అల్లూరికి కావలసిన పోరాట యోధులను తయారు చేసుకున్నారని చెప్పారు. బ్రిటిష్ పోలీస్ స్టేషన్లపై పోరాటం, సాయుద పోరాటం ఒక ప్రత్యేకత అని అన్నారు. అతి చిన్నవయస్సులోనే దేశం కోసం తన ప్రాణాలు అర్పించిన మహా శక్తి సంపన్నులు అల్లూరి సీతారామరాజు అని గంటా నూకరాజు అన్నారు. ఇలాంటి మహనీయుడు మనం జీవిస్తున్న ఈ నేలపై పుట్టి పెరగడం, ఇక్కడే విద్యాబ్యాసం చేయడం మన అదృష్టమని అన్నారు. అల్లూరి సీతారామరాజు యొక్క జీవితాన్ని నేడు ప్రతీ విద్యార్థికి తెలియజేయాలని, చెడుపై మంచి విజయానికి ఏ విధంగా కృషి చేశారో తెలియజేయాలని గంటా నూకరాజు విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చురకల రమణ, గండిబోయిన పోలిరాజు, కెఎస్.ఆర్. కృష్ణారావు, సంకురుభుక్త జోగారావు తదితరులు మాట్లాడారు.
3వ వార్డు తెలుగు మహిళ అధ్యక్షురాలు పైడిపల్లి ఎల్లయ్యమ్మ, కొక్కిరి అప్పన్న, కంచెర్ల కామేష్, రాజగిరి రమణ, నొల్లి రమణ, వియ్యపు పోతురాజు, పైడిపల్లి నర్సింగరావు, వాసుపల్లి వంశీ, దౌలపల్లి హరీష్, వాడమొదలు రాంబాబు, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.