ఉత్తరాంద్ర అభివృద్ధి కి తొలిమెట్టు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం - అదాని డేటా సెంటర్ అంటున్న అవంతి

ఉత్తరాంద్ర అభివృద్ధి కి తొలిమెట్టు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం - అదాని డేటా సెంటర్ అంటున్న అవంతి


*భీమిలి నియోజకవర్గం - మదురవాడ జోన్ (ఐటి సెజ్) - 03-05-2023 - బుదవారం*


*రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి చేతులు మీదుగా ఈరోజు జరిగిన పలు శంకుస్థాపనలు ను స్వాగతించిన అవంతి*


*ఈ కార్యక్రమాలను ఉద్దేశించి మీడియాతో అవంతి మాట్లాడుతూ విశాఖ జిల్లా మదురవాడ లో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారి కృషి వలన ఐటి సెజ్ నిర్మాణం చేపట్టడం జరిగిందని ఈరోజు ఆయన కుమారుడైన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆదానీ వారి సౌజన్యంతో ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ - టెక్నాలజీ బిజినెస్ పార్క్ కి శ్రీకారం చుట్టి శంకుస్థాపన చేయడం జరిగిందని ఇది విశాఖ వాసుల ఎన్నో ఏళ్ళు కల ఈ నిర్మాణం వలన విశాఖ జిల్లా తో పాటు ఉత్తరాంద్ర లో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని విశాఖ జిల్లా ని పరిపాలనా రాజదాని గా చేస్తాం అంటే ప్రతి పక్షాలు ఎన్నో ఆటంకాలు చేసాయి వీరంతా విశాఖ వాసులే కదా విశాఖ వాసులు నుంచి ఓట్లు కావాలి పదవులు కావాలి కానీ విశాఖ జిల్లా కి రాజదాని వద్దు అనడంలో వీరి వైఖరి ఏంటో అర్థం కాలేదు వీటినన్నిటిని ప్రజలు గ్రహిస్తున్నారు కులం మతం పార్టీ ప్రాంతం లకు అతీతంగా అన్ని ప్రాంతాలు అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలి అన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఇప్పటికే దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పలు నూతన సంస్కరణలు తీసుకువచ్చి పాలకులు అవసరం లేని వ్యవస్థ ద్వారా నేరుగా ప్రజలకే పాలన అందేలా చేసారు* 

*అభివృద్ధి అంటే నాలుగు బిల్డింగ్ లు నిర్మాణాలు కాదు పేద వాడికి కూడు గూడు విద్య వైద్యం వీటిని నాడు నేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు జగనన్న కోలనీ లు సంక్షేమ పథకాలు అమలు ద్వారా అందిస్తున్నారు వీటిని కూడా సహించలేని వారు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా వైసిపి ప్రభుత్వం అందించిన పాలన తో జగన్ గారు ప్రజలు మనసుల్లో ఉన్నారు రాబోయేది వైసిపి ప్రభుత్వమే దీనిని ఎవరూ అడ్డుకోలేరు అనేది వాస్తవం బోగాపురం లో గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం రావడం చాలా సంతోషించదగ్గ విషయం ఉత్తరాంధ్ర అభివృద్ధి కి వైసిపి ప్రభుత్వం కట్టుబడి ఉందని మాట్లాడారు* 


*మీడియా సమావేశంలో విశాఖ జిల్లా వైసిపి పార్టీ అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు గారు - మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం పరిశీలకులు పసుపులేటి బాలరాజు గారు - భీమిలి నియోజకవర్గం వైసిపి శ్రేణులు పాల్గొన్నారు*