రెవెన్యూ మరియు పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లో విజయం సాధించిన రెవెన్యూ

రెవెన్యూ మరియు పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లో విజయం సాధించిన రెవెన్యూ 

మహబూబాబాద్: వి న్యూస్: మే 7:

జిల్లా కలెక్టర్ కె శశాంక రెవెన్యూ వర్సెస్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కెప్టెన్లుగా వ్యవహరించిన పోలీస్ క్రికెట్ జట్లు కు ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో తలపడ్డాయి. తొలుత టాస్ గెలిచిన రెవెన్యూ జట్టు బౌలింగ్ ఎంచుకోగ బ్యాటింగ్ ఎంచుకున్న ఎస్పీ శరత్ చంద్ర పవార్  ప్రాతినిధ్యం వహించిన పోలీస్ జట్టు నిర్ణీత 16 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేశారు. అనంతరం 98 పరుగుల లక్ష్యం కోసం బ్యాటింగ్ చేపట్టిన కలెక్టర్ శశాంక ఐఏఎస్ ప్రాతినిధ్యం వహించిన రెవెన్యూ జట్టు 10 ఓవర్లకు ఒక వికెట్ కూడా కోల్పోకుండా విజయాన్ని సాధించింది. కాగా పోలీసు జట్టులో ఎస్పి శరత్ చంద్ర పవర్  అత్యధికంగా 30 పరుగులు చేశారు అత్యధికంగా  రవెమ్యూ జట్టులో వెంకటేష్ 39 బాల్స్ లో 65 పరుగులు చేసి జట్టు విజయం అందించడంలో కీలక పాత్ర పోషించాడు. పోలీస్ జట్టును బ్యాటింగ్లో కోల్పోకుండా చేసిన బౌలర్ చంద్రశేఖర్ 3 ఓవర్లలో 9 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. పోలీసు జట్టును ఓడించేందుకు నాలుగు వికెట్లు తీసిన చంద్రశేఖర్ కు మాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు అందించారు. చివర్లో బ్యాటింగ్కు వచ్చిన కలెక్టర్ శశాంక ఐఏఎస్  విజయానికి రెండు పరుగులు అవసరం కాగా నాలుగు కొట్టి జట్టును గెలిపించారు.