మన్యం వీరుడు అల్లూరికి ఘన నివాళి
మధురవాడ వి న్యూస్
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా చంద్రంపాలెం బాపూజీ కళా మందిరం వద్ద ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి చంద్రంపాలెం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
భారతదేశానికి స్వాతంత్ర్య సాధనలో ప్రజలను చైతన్య పరిచి స్వాతంత్ర్య సాధనకు నాంది పలికారని, స్వాతంత్ర్య సాధనలోనే తెల్ల దొరల తుపాకీ గుళ్లకు అసువులు బాసారని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు, ఈ కార్యక్రమంలో సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు పిళ్లా కృష్ణమూర్తి పాత్రుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు పిళ్లా సూరిబాబు, పోతిన పైడిరాజు, పిళ్లా చంద్రశేఖర్, పిళ్లా అప్పన్న, పీస రామారావు,దుర్గాశి సోంబాబు, అర్. సూరిబాబు మరియు గ్రామస్తులు గూడేల కామేశ్వరరావు, పిళ్లా రాము, గూడేల శ్రీను తదితరులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.