సిపిఐ, సిపిఎం నాయకులు అరెస్ట్

 సిపిఐ, సిపిఎం నాయకులు అరెస్ట్

మధురవాడ వి న్యూస్

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మిక సంఘాల ఐక్యవేదిక సిపిఐ సిపిఎం ఇతర వామపక్ష పార్టీలు నిర్ణయం మేరకు విశాఖపట్నం లో  రాజకీయ పార్టీలు, కార్మిక, ప్రజా సంఘాలు మే 3వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన రాస్తారోకోలకు 10 వామపక్ష పార్టీలు మద్దతు ప్రకటించి, ప్రత్యక్షంగా పాల్గొనాలని నిర్ణయించాయి.సిపిఐ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజుని ఇంటి వద్ద హౌస్ అరెస్ట్ చేశారు. తగరపువలస, మధురవాడ సిపిఐ, సిపిఎం నాయకులు అల్లు బాబురావు, ఆర్ ఎస్ ఎన్ మూర్తి, వి సత్యనారాయణ, డి అప్పలరాజు తదితరులను అరెస్ట్ చేసి భీమిలి, పి ఎం పాలెం పోలీస్ స్టేషన్ లలో ఉంచారు.


ఈ సందర్బంగా పైడిరాజు మాట్లాడుతూ గడిచిన 810 రోజులుగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వం రంగం లోనే కొనసాగించాలని నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా ఎలాగైనా అమ్మేస్తాం అని నిసిగ్గుగా వ్యవహరించడం ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చెయ్యడమేనని అన్నారు. కేంద్రం ఇంత అన్యాయం చేతున్నా ఏమి అనలేని మాట్లాడలేని స్థితిలో రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఉన్నారని ఆందోళన చేస్తున్న వారిని అక్రమంగా అరెస్టులు చెయ్యడం ద్వారా మీరు విశాఖ ఉక్కు అమ్ముకోండి, ప్రభుత్వం రంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టుకోండి అని పరోక్షంగా చెపుతున్నారా అని సిపిఐ తరుపున ప్రశ్నించారు. అరెస్టులు వల్ల సమస్యలు పరిష్కారం కావని అరెస్తులు కమ్యూనిస్టులకు కొత్తకాదని తక్షణమే అక్రమంగా అరెస్టులు చేసినవారందరిని విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. కేవలం తన కేసులు నుండి బయట పడడం కోసం రాష్ట్రన్ని ఇలా కేంద్ర బీజేపీ కి స్వాధీనం చేస్తున్నారా అని అన్నారు. విశాఖ ఉక్కు ప్రభుత్వం రంగం లోనే కొనసాగించాలని, స్వంత ఘనులు కేటాయించాలని, వర్కింగ్ కేపిటల్ ఇచ్చి ఉక్కు ను ఆదుకోవాలని డిమాండ్ చేశారు*