మాతృ దినోత్సవం రోజున అమ్మఒడి బాల బాలికలతో గడిపిన గంటా శ్రీనివాస్ రావు.
మధురవాడ: వి న్యూస్: మే 14:
మధురవాడ :ప్రపంచ మాతృ దినోత్సవం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం మాజీ మంత్రి ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు సీనియర్ టిడిపి నేత గంటా శ్రీనివాసరావు, ఆయన తనయుడు రవితేజ తో కలిసి అమ్మఒడి బాలుర సంరక్షణ కేంద్రంలో బాల బాలికలతో వారి చేత కేక్ కట్ చేసి మిటాయిలు తినిపించారు. ఈ సందర్భంగా పిల్లలతో మాజీ మంత్రి గంటా కాసేపు సరదాగా గడిపారు. పిల్లలందరికీ భోజనం ఏర్పాటు చేశారు. గంటా శ్రీనివాసరావు స్వయంగా బాల బాలికలకు వడ్డించారు. ఈ కార్యక్రమంలో6 వ వార్డ్ టిడిపి అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, గంటా మాజీ పిఏ,ఎన్ స్వామి తదితరులు పాల్గొన్నారు.