గిరిజనులకు తప్పని డోలిమోత కష్టాలు
అల్లూరి జిల్లా,అనంతగిరి వి న్యూస్ మే 3 :-
అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యం మారుమూల గ్రామాలలో సరైన రహదారి సౌకర్యం లేక గిరిజనులు డోలిమోత కష్టాలు తప్పడం లేదు అనంతగిరి మండలం, గుమ్మ పంచాయితీ, పరిధిలో కర్రిగుడ అను గ్రామానికి చెందిన సింబాయి శాంతి (19) అనే యువతకి మంగళవారం ఉదయం తీవ్ర కడుపునొప్పి వచ్చింది.ఈ మేరకు ఆ గ్రామంలో సరైన రోడ్డు సౌకర్యం లేక అంబులెన్స్ రాక.కడుపునొప్పితో బాధపడుతున్న శాంతిని కుటుంబీకులు డోలు కట్టి ఎస్.కోట ఏరియా ఆసుపత్రికి కుటుంబీకులు తరలించారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి కర్రిగుడ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.