మానవ సేవే మాధవసేవ" అంటూ మానవత్వం చాటుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్..
పెరాలసిస్ తో బాధపడుతున్న వ్యక్తికి 20,000 ఆర్థిక సహాయం...
విశాఖ: వి న్యూస్ : మే 07:
విశాఖలో గత కొన్ని సంవత్సరాలుగా గాజువాక ప్రాంతంలో పెద్ద గంట్యాడలో ఎండ ప్రదీప్ జీవనం కొనసాగిస్తున్నారు.పేదరికంతో ఎన్నో కష్టాల్ని ఎదుర్కొంటూ "కూటి కోసం కోటి విద్యలు" అన్నట్టు గవర్నమెంట్ ఉద్యోగం నిమిత్తం SSC ఎక్సమ్ రాయటానికి వెళ్లిన ఎండ ప్రదీప్ ట్రైన్ ఆక్సిడెంట్ లో తిరిగిరాని లోకాలకు పయనం అయినారు.ప్రదీప్ తల్లి తన చిన్నతనంలోనే చనిపోవడం, తన తండ్రి గత పది సంవత్సరాల నుంచి పెరాలసిస్ తో బాధపడుతున్నారు,చెల్లి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది.కుటుంబ బాధ్యతలు మోస్తూ ఉన్న కొడుకు మరణించడంతో తండ్రి మానసికంగా కృంగిపోయి కుటుంబం దీన పరిస్థితుల్లో ఉన్నట్టు ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ గ్రహించి "మానవసేవే మాధవసేవ " అంటూ మానవత్వంతో ఆర్థికంగా కృంగిపోయిన ఈ కుటుంబానికి చేదోడుగా అక్షరాల 20,000 వేల రూపాయలు ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరుపున ఈ కుటుంబాన్ని అందజేయడం జరిగింది.ఈ అసోసియేషన్ కొన్ని సంవత్సరాలు నుంచి పేద ప్రజలకు తమకు తోచిన సహాయం అందిస్తూ, ఎన్నో అన్నదాన కార్యక్రమాలు, వృద్ధులకు చీరల పంపిణీ ఇలా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మనసులో తమ ఉనికిని చాటుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేపడతామని అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి బాల తెలిపారు. ఈ కార్యక్రమంలో 73వ వార్డు జనసేన ఇంచార్జ్ రౌతు గోవింద్, అప్పలరాజు, గంగవరం రాజు, గల్లా వంశి, స్వరూప్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.