మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి కోసం బీచ్ రోడ్ లో ఏర్పాట్లు

మన్యం వీరుడు  అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి కోసం బీచ్ రోడ్ లో  ఏర్పాట్లు

తెలుగు వారి ఆత్మ గౌరవానికి ప్రతీక అల్లూరి వర్ధంతి కార్యక్రమాలు 

అల్లూరి సీతారామరాజు:వి న్యూస్ :మే 3


ఆంధ్ర విశ్వకళాపరిషత్ ,తెలుగు & సంగీత నృత్య శాఖలు మరియు సమైక్య భారతి సంయుక్త ఆధ్వర్యంలో మే 7 వ తేదీ ఆదివారం సాయింత్రం 5 గంటలకు  బీచ్ రోడ్డులోని పండిట్ జవహార్ లాల్ విగ్రహాం ఎదురు ఉన్న స్వాతంత్ర్య సమరయోధుల మైదానంలో విప్లవ జ్యోతి,మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి జరుపుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన పత్రికా విలేఖర్ల సమావేశం  ఆంధ్రవిశ్వకళాపరిషత్ సంగీత నృత్య విభాగంలో  నిర్వహించబడింది.ఈ సమావేశంలో విశ్వవిద్యాలయ రెక్టార్   ఆచార్య కె సమత మాట్లాడుతూ అల్లూరి తెలుగు వారి ఆత్మ గౌరవానికి ప్రతీక అని ధీరత్వానికి దిక్చూచి అని అతడు బ్రిటిష్ వారి గుండెల్లో గుబులు పుట్టించిన ధీరుడని, ప్రభుత్వాన్ని గడగడలాడించి తాను ఎప్పుడు ఏక్కడ దేని మీద దాడి చేస్తున్నానో వివరాలు వెల్లడించేవాడని తాను దాడి చేసి దక్కుంచుకున్న వస్తువుల వివరాలు వెల్లడించిన సమర్ధుడని అటువంటి వ్యక్తి బహుశా భారతదేశంలోనే ఉండరని అటువంటి మహనీయుడని స్మరించుకోవలసిన ఆవశ్యకత మనందరిపై ఉందన్నారు.

ఈ క్రమం లో ఆంధ్ర విశ్వ కళాపరిషత్ తెలుగు విభాగం ,సంగీత నృత్య శాఖలు మరియు సమైక్య భారతి సంయుక్త ఆద్వర్యం లో అల్లూరి శతవర్ధంతి సందర్భముగా బీచ్ రోడ్ లో మే 7  వ తేదీ ఉదయం10 గంటలకు గాంధీ పార్క్ శ్రీ విష్ణు అపార్ట్మెంట్ జంక్షన్   దసపల్లా  హిల్స్ వద్ద ఉచిత వైద్య శిభిరం ఏర్పాటు చేయడం అదే విధంగా సాయింత్రం 5  గంటలకు బీచ్ రోడ్ లో స్వాతంత్ర్య సమరయోధుల మైదానం లో సమావేశాలతో పాటు సంగీత నృత్య శాఖల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా విద్యార్థునులచే దేశభక్తి పూరితమైన నృత్యాలు ,పాటలు ,ఏకపాత్రాభినయం వంటి కార్యక్రమాలు ఉంటాయని,అల్లూరి వర్ధంతి  సమావేశానికి సభాధ్యక్షులుగా విజయనగరం సెంచూరియన్ యూనివర్శిటీ ఉపకులపతి  ఆచార్య  జి.యస్.యన్. రాజు, ముఖ్య అతిథిగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ రెక్టార్  ఆచార్య  పి. వరప్రసాద్ మూర్తి, విశిష్ట అతిథులుగా ఆంధ్రవిశ్వ కళాపరిషత్,తెలుగు విభాగం శాఖాధిపతి ఆచార్య జర్రా అప్పారావు,డా॥ రాయల సుబ్బారావు, ఆచార్య జి. యోహన్ బాబు,గురజాడ అప్పారావు గారి ముని మనవడు డా॥ యం. విజయగోపాల్, ఆచార్య యం.వి.ఆర్. రాజు, ఆచార్య సి. మంజులత, విజయనిర్మాణ సంస్థ చైర్మన్,డా॥ యస్. విజయ కుమార్ తదితరులు పాల్గొంటారని తెలియజేసారు .ఈ కార్యక్రమం లో  విజయనిర్మాణ సంస్థ చైర్మన్,డా॥ యస్. విజయ కుమార్  ,సంగీత నృత్య విభాగాధిపతి ఆచార్య ఏ అనురాధ ,పాఠ్య ప్రణాళిక సంఘ అధ్యక్షులు ఆచార్య కె సరస్వతి విద్య ,ఆహ్వాన సంఘ అధ్యక్షులు డా బూసి వెంకటస్వామి ,సమైక్య భారతి జాతీయ సమన్వయ కర్త  పి కన్నయ్య , గాయక శిఖామణి యం వి ఆర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.