మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు సెంటు భూమిపై చేసిన అనుచిత వ్యాఖ్యల పై మండి పడ్డ సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబెర్ ముదుండి రాజేశ్వరి.

మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు సెంటు భూమిపై చేసిన అనుచిత వ్యాఖ్యల పై మండి పడ్డ సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబెర్ ముదుండి రాజేశ్వరి.

మధురవాడ: వి న్యూస్ :మే 20 : 

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న చేపట్టిన రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ళు లేని పేదవారికి భారత దేశంలో ఎక్కడ ఎవ్వరు చెయ్యని విధంగా భారీగా ఇంటి పట్టాలు లబ్ధిదారులుకు అందచేసి ఇళ్ళు నిర్మాణం చేపట్టే కార్యక్రమంలో భాగంగా అమరావతిలో 50వేల మందికి ఇళ్ల పట్టాలను అందచేయటానికి సిద్ద పడుతున్న తరుణంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను అవమానించే విధంగా మీకీచ్చే సెంటు భూమి శవం పూడ్చటానికి కూడా సరిపోదు అంటూ టీడీపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అహకారంతో మాట్లాడటాన్ని సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబెర్ ముదుండి రాజేశ్వరి తీవ్రంగా ఖండిస్తూ చంద్రబాబు పై మండిపడ్డారు. జగనన్న పేదల పాలిట పెన్నిధి ప్రజలు గుండెల్లో తండ్రిలా చిర స్థాయిలో నిలిచిపోయే విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందిస్తూ నవరత్నాలలో సంపూర్ణంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు 100 శాతం నేరవేర్చి ప్రజల మన్ననలు పొందుతుంటే ఓర్వలేక 40ఏళ్ళ రాజకీయ అనుభవం అని చెప్పుకునే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అహకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా మాట్లేడేటప్పుడు వయస్సు, అనుభవం తో ప్రజలకు ఉపయోగ పడే వ్యాఖ్యలు చేయాలని జగనన్న ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను మీరు గుర్తించకపోయినా పర్వాలేదు కానీ అహకారంతో అనుచిత వ్యాఖ్యలు చెయ్యొద్దని సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబెర్ ముదుండి రాజేశ్వరి అన్నారు.