స్త్రీల ఆరోగ్యంపై అవగాహన

 స్త్రీల ఆరోగ్యంపై అవగాహన

పియం పాలెం వి న్యూస్..

 వాసవ్య మహిళా మండలి మరియు విప్రో వారి సౌజన్యంతో కుషాల్ ప్రాజెక్ట్ విశాఖలో 72 అర్బన్ హెల్త్ సెంటర్లలో కుషాల్ మిత్రలకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మహా విశాఖ 6వ వార్డు పరిధి బక్కన్నపాలెం అంగన్వాడీ కేంద్రంలో స్త్రీల ఆరోగ్యంపై వాసవ్యా మహిళ మండలి తరుపున కుషాల్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో మంగళవారము అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు, బాలింతలు, మహిళలు, బాలికలు, రుతుక్రమం ఆగిన స్త్రీలు, సంపూర్ణ ఆరోగ్యo కోసం అందుబాటులో ఉన్న ఆరోగ్య కేంద్రములో, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలుపై అలాగే వివిధ రకములైన క్యాన్సర్లు, ఇతర విషయాలపై అవగాహనా కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రావణి, కమ్యూనిటీ కోఆర్డినేటర్ రమ్య, ప్రసన్న లక్ష్మి, అంగన్వాడీ టీచర్ దేవి, మహిళా పోలీసులు వనజాక్షి, రమ్య, కమ్యూనిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.