పాడేరు లోనే భూముల రిజిస్ట్రేషన్ లు నిర్వహించాలి

పాడేరు లోనే భూముల రిజిస్ట్రేషన్ లు నిర్వహించాలి

అల్లూరి జిల్లా,పాడేరు వి న్యూస్ మే 2 :-

మన్యం భూముల రిజిస్ట్రేషన్ లు ఇకపై మాడుగులలో నిర్వహిస్తామన్న సబ్ రిజిస్టర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం*

*త్వరలో జిల్లా కలెక్టర్ కు పిర్యాదు*

*రిజిస్ట్రేషన్ కార్యాలయం మార్పు వెనక వైసీపీ రాష్ట్ర నేతల హస్తం ఉందా.?*

బీజేపీ జిల్లా అధ్యక్షులు పాంగి రాజారావు*

అల్లూరి జిల్లా లోని గిరిజన ప్రజల భూములకు పాడేరు లోనే రిజిస్ట్రేషన్ చెయ్యాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాంగి రాజారావు గారు మంగళవారం ఒక ప్రకటన లో పేర్కొన్నారు.గతం లో లాగే పాడేరు లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహించాలన్నారు,అన్ని హక్కులను కలిగిన చాలా మంది గిరిజనుల భూములు ఇప్పటికే అన్యాక్రాంతం అయ్యాయని, ఈ నిర్ణయం తో మరింతగా గిరిజనుల భూములు ఇతరలు చేతికి వెళ్ళి, గిరిజన ప్రజలు రోడ్డున పడేందుకు ఆస్కారం ఉందన్నారు, పాడేరు భూముల రికార్డ్ లను మాడుగుల లోని రిజిస్టర్ కార్యాలనికి తరలించేందుకు సబ్ రిజిస్టర్ పురుషోత్తం గారు నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదన్నారు,సబ్ రిజిస్టర్, ఐటీడిఎ ప్రాజెక్ట్ అధికారి తీసుకున్న ఈ నిర్ణయాన్ని బీజేపీ అరకు పార్లమెంట్ తరుపున వ్యతిరేకిస్తున్నాం అన్నారు, అసలు ఉన్నట్టుండి రిజిస్ట్రేషన్ కార్యాలయం మార్పు వెనకాల వైసీపీ రాష్ట్ర నాయకుల ప్రమేయం కూడా ఉందా.. అన్న అనుమానం ప్రజల్లో కలుగుతుందన్నారు,జిల్లా కేంద్రం ఏర్పాటు ఐనా తరువాత ఇంకో జిల్లా లో భూముల రిజిస్ట్రేషన్ ను ఎలా నిర్వహిస్తారని బీజేపీ జిల్లాఅధ్యక్షులు పాంగి రాజారావు గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు,సబ్ రిజిస్టర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవలని డిమాండ్ చేశారు,త్వరలో ఈ సమస్య పై అల్లూరి జిల్లా కలెక్టర్ మరియు పాడేరు ఐటీడిఏ ప్రాజెక్ట్ అధికారిని కలుస్తామని పేర్కొన్నారు, పాడేరు లోనే గిరిజనుల భూములు రిజిస్ట్రేషన్ చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మఠం శాంత కుమారి, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు పాంగి మత్స్య కొండబాబు, పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు.