జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు

జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో  ప్రత్యేక పూజలు 

మధురవాడ వి న్యూస్ 

 మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో వైశాఖ మాసం శుక్ల పక్ష పౌర్ణమి శుక్రవారం  భక్తులతో కిట కిట లాడింది,  ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమై ప్రత్యేక కుంకుమార్చన, పుష్పార్చన మొదలగు పూజా కార్యక్రమాలు జరిపించడం జరిగింది, సాయంత్రం అమ్మవారికి సుగంధ ద్రవ్య పంచామృత జలాభిషేకములు ఆలయ అర్చకులు  పట్నాల సుబ్బారావు శర్మ, హరిప్రసాద్ శర్మ, మూర్తి శర్మ, హరి చరణ్ శర్మ, శాస్త్రోక్తంగా జరిపించడం జరిగింది, 

మధురవాడ చంద్రంపాలెం వాస్తవ్యులు శ్రీ పోతిన పైడిరాజు, శ్రీమతి సావిత్రి దంపతులు వారి కుమారుడు పోతిన అనిల్ కుమార్ పేరున  మరియు కామేశ్వరరావు, శ్రీధర్ ల ఆర్ధిక సహాయంతో ఈరోజు ఆలయంలో పులిహోర ప్రసాదం ఏర్పాటు చేసి భక్తులకు పులిహోర ప్రసాదం  పంపిణీ చేయడం జరిగింది, వైశాఖ మాసం పౌర్ణమి శుక్రవారం కావడంతో అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి శ్రీ దుర్గాలమ్మ అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు,

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు పిళ్లా సూరిబాబు, సెక్రటరీ నాగోతి తాతారావు, ఉపాధ్యక్షులు పి.వి.జి. అప్పారావు, కోశాధికారి పిళ్లా శ్రీనివాసరావు, సభ్యులు పోతిన పైడిరాజు, పిళ్లా మోహన్ శివ కృష్ణ, పిళ్లా వెంకట రమణ,  పిళ్లా సన్యాసిరావు, దుర్గాశి సోంబాబు, నాగోతి అప్పలరాజు, గ్రామ పెద్దలు పీస రామారావు, బోగవిల్లి నాని ఆలయ ముఖ్య సభ్యులు  పిళా పోతరాజు, పి.వెంకటరమణ, పిళ్లా అప్పన్న, పోతిన కిషోర్, యస్.రమేష్, సతీష్, శ్రీను మరియు అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు