మానవాళి మనుగడలో ప్రమాదకరమైన మొక్క

మానవాళి మనుగడలో ప్రమాదకరమైన  మొక్క

వి న్యూస్ :మే 13 : 

చూచేందుకు ఈ మొక్క చాలా అందంగా కనిపిస్తుంది కదూ.మల్లెపూల తోట లాగా చాలా ఆకర్షణీయంగా కనబడుతుంది కదూ!!!ఐతే ఇది చాలా ప్రమాదకరమైన మొక్క . ఎటువంటి నేలలలోనైనా,ఎటువంటి వాతావరణంలోనైనా చాలా వేగంగా పెరుగుతుంది. ఇది పెరిగే చోట మరో మొక్క పెరగడం కష్టం. దీని వల్ల మానవునికి చాలా కీడు జరుగుతుంది.పంటలు దెబ్బతినడంతోపాటు , ఆయాసం,ఉబ్బసం, వళ్ళంతా దురదలు,దద్దులతో పాటు అలర్జీ వస్తుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు దీనికి దూరంగా వుంటేచాలా మంచిది. అలాగే పశువులకు కూడా చాలాహానిచేస్తుంది. ఇది తిన్న పశువుల జీర్ణక్రియ దెబ్బతిని,విసర్జన క్రియ మందగిస్తుంది. వాటి మూతి చుట్టూ బొబ్బర్లు వచ్చి ఆహారం తీసుకోవడానికి కష్టమౌతుంది. ముఖ్యంగా మెట్ట పంటరైతులకు ఇది చాలా ప్రమాదకరమైనది. ఇంతకు దీని పేరేమిటంటారా ???                పార్థీనియం.తెలుగులో వయ్యారిభామ. మనదేశం యొక్క అజాగ్రత్త ద్వారా ఆస్ట్రేలియా దేశం నుండి గోధుమల ద్వారా మనదేశానికి దిగుమతి అయింది. మన వ్యవసాయాన్ని చిన్నాభిన్నం చేయబోతుంది.  దీని జాతిః- పార్థీనియం ప్రజాతిః-హీలియాంతియా కుటుంబంః-ఆష్టిరేసియా క్రమముః-ఆస్టిరాలెస్  ఉన్నతవిభాగం:- స్పెర్మటోఫైటా  నిర్మూళనః- ఇది పుష్పించక ముందే మొక్కలను పీకి కాల్చివేయాలి. ఫ్రెండ్స్ దీని యొక్క స్పోర్స్ కొన్ని వందలమైళ్ళు ప్రయాణిస్తాయి......