అకాల వర్షాలు కారణంగా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలి..!
కాకినాడ ( వి న్యూస్ :) మే 08 2023.
కాకినాడ స్పందన కార్యక్రమంలో కలెక్టర్ కి రైతుల తరఫున అర్జి సమర్పించి.. పిఠాపురం జనసేన పార్టీ...!!
పిఠాపురం మండలంలో గత వారం పడిన ఆకాల వర్షాలకు నీట మునిగిన పంటలలో క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాలకు సంబంధించి వివరాలు తెలుసుకున్న మాకినీడి శేషు కుమారి , మాట్లాడుతూ నష్టపరిహారం అందే వరకు జనసేన అండగా ఉంటుందని జనసేన పార్టీ పోరాడుతుంది అని హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగా అకాల వర్షాలు కారణంగా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని రైతులు తీవ్ర నష్టాన్ని గురయ్యారని, నష్టపోయిన రైతుకు ప్రభుత్వం నష్టపరిహారం వెంటనే అందించాలని తెలియజేశారు, కలెక్టరేట్ లో జరిగిన స్పందన కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి మాకినీడి శేషు కుమరి ఆదేశాల మేరకు పిఠాపురం మండల నాయకుడు గోపు సురేష్ మరియు గ్రామస్థులు కలెక్టర్ కి ,అర్జి సమర్పించి, సమస్యను వివరించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ సర్వే నిర్వహించి నష్ట పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్ అమరాది వల్లి రామకృష్ణ, కొడమంచిలి దుర్గాప్రసాద్, నామ సాయిబాబు, నక్క బద్రి, నాయకులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.