నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న కార్పొరేటర్ మొల్లి హేమలత.

నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న కార్పొరేటర్ మొల్లి హేమలత.

మధురవాడ: వి న్యూస్ :మే 10 :

కార్పొరేటర్ మొల్లి హేమలత కృషిని అభినందిస్తున్న వార్డ్ ప్రజలు 

పేద ప్రజల ఇళ్లకు ఇంటి పన్నులు వేయాలి...! జీవీఎంసీ కౌన్సిల్ లో ఆమె అడిగిన ప్రశ్నకు పరిష్కార మార్గం చూపిన అధికారులు.

జీవీఎంసీ అన్ని జోన్ లలో ఇంటి పన్నులు వేయమని (సర్కులర్) ఆదేశాలు జారీ చేసిన అధికారులు.

జీవీఎంసీ కమీషనర్, మేయర్ కి కృతజ్ఞతలు తెలిపిన కార్పొరేటర్ మొల్లి హేమలత.

మధురవాడ : ఎన్నో ఏళ్లుగా జీవీఎంసీ 5వ వార్డు పరిధిలోని పేదప్రజల ఇల్లు,కొండవాలు ప్రాంతాలలో నివసిస్తున్న ఇళ్లకు ఇంటిపన్నులు వేయకపోవడంతో మంచినీటి కుళాయిలులేక తాగునీటికి ప్రజలు ఇబ్బందులు మరియు విద్యుత్..తదితర సమస్యలు తలెత్తుతున్నాయని వెంటనే పేద ప్రజల ఇళ్లకు పన్నులు వేసి కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత కౌన్సిల్ లో జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్, మేయర్ హరి వెంకటకుమారి దృష్టికి తేవడంతో... స్పందించిన అధికారులు జీవీఎంసీ అన్ని జోన్ లలో పేద ప్రజల ఇళ్లకు,కొండవాలు ప్రాంతాల్లో నివాసముంటున్న ఇళ్లకు పన్నులు వేయని వారందరికీ 'ఇండె మ్నిటీ బాండ్ పై ఆస్తి పన్ను వేయాలని నగర మేయర్,కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.నూరుశాతం అపరాధ రుసుముతో 'హోల్డర్ ఆఫ్ ది ''ప్రిమిసెస్' పేరిట ఆస్తిపన్ను విధించనున్నామని, అర్హులైన వారు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత కోరారు.ప్రజా సమస్యల పరిష్కారం లో  కార్పొరేటర్ మొల్లిహేమలత  చూపిస్తున్న చొరవ అభినందనీయమని స్థానిక ప్రజలు అభినందనలు తెలిపారు.