పాండ్రంగి విప్లవజ్యోతి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 99వ వర్ధంతికి ఘన నివాళులు:-
పద్మనాభం: వి న్యూస్ మే 07:
విశాఖ జిల్లా పద్మనాభం మండలం లో పాండ్రంగి గ్రామంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి మహంతి అప్పల రమణ ఆధ్వర్యంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 99వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బిజేపి విశాఖ జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షులు పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్ పాల్గొని, ఆయన మాట్లాడుతూ,అల్లూరి సీతారామరాజు యువతకు ఆరాధ్యుడు.పాoడ్రంగి గ్రామంలో పుట్టి పెరిగిన మన్యం గుండె గుడిలో కొలువైన దేవుడు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని హడలగొట్టిన ధీరుడు. తెలుగు జాతిని వెలుగులోకి తెచ్చిన ప్రభాకరుడు.మన్యం ప్రజలు కొలుచుకొన్న శ్రీ రామ చంద్రుడు. అల్లూరి సీతారామరాజు శతాబ్ది వర్ధంతి సందర్భంగా ఆ మహావీరునకు శ్రద్దాంజలి ఘటిస్తూ ఘన నివాళులు అర్పిస్తున్నాము. ఈ కార్యక్రమంలో బిజెపి పద్మనాభం మండల అధ్యక్షులు రెడ్డి పల్లి శ్రీనివాసరావు, జిల్లా కిసాన్ మోర్చ నాయకులు సారిక ప్రకాష్,బిజేపి మండల ప్రధాన కార్యదర్శి,పాలురి కృష్ణారావు, మళ్ళారపు కృష్ణ, మరియు బిజేపి కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.