రూ.535 కోట్లతో నడిరోడ్డుపై నిలిచిపోయిన ట్రక్

రూ.535 కోట్లతో నడిరోడ్డుపై నిలిచిపోయిన ట్రక్

చెన్నై: వి న్యూస్: మే 18:

వందల కోట్ల నగదును తరలిస్తున్న ఓ ట్రక్‌ బ్రేక్‌డౌన్ కావడంతో నడిరోడ్డుపై నిలిచిపోయింది. తాజాగా చెన్నైలో ఈ ఘటన జరిగింది. రిజ్వర్ బ్యాంక్ నుంచి రూ. 535 కోట్లను రోడ్డు మార్గంలో విల్లుపురానికి తరలిస్తుండగా ట్రక్ అకస్మాత్తుగా ఆగిపోయింది. 

ట్రక్‌లో నగదు ఉన్నట్టు తెలుసుకుని ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడటంతో పోలీసులు ఘటన స్థలంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు.