3 రోజులు అస్సలు బయటకి రావొద్దు, ఏపీ ప్రజలకు సర్కారువారి హెచ్చరిక.

3 రోజులు అస్సలు బయటకి రావొద్దు, ఏపీ ప్రజలకు సర్కారువారి హెచ్చరిక.

తెలుగు రాష్ట్రాలు: వి న్యూస్ మే 18: 

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. రెండు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారాయి. ఓవైపు ఉక్కపోత.. మరోవైపు వడగాలులకు జనం ఉక్కిరిబిక్కరవుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. రెండు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారాయి. ఓవైపు ఉక్కపోత.. మరోవైపు వడగాలులకు జనం ఉక్కిరిబిక్కరవుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. వచ్చే 3 రోజులు కూడా ఎండలు తీవ్రంగా ఉంటాయని విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ సునంద చెబుతున్నారు. ఇప్పటికే సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4డిగ్రీల అధికంగా నమోదవుతున్నాయి. తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ క్రమంలో బాలింతలు బాలింతలు, గర్భిణీలు, వృద్ధులు, చిన్న పిల్లలు బయటకు రాకూడదంటూ విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. అత్యవసర సమయాల్లో 1070 లేదా 18004250101కు కాల్ చేయాలని అధికారులు సూచించారు.