ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన
విశాఖపట్నం, ఏప్రిల్-29:-
రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి 3వ తేదీన విశాఖ నగర పర్యటన సందర్భంగా టీటీడీ చైర్మన్, ఉమ్మడి జిల్లా సమన్వయకర్త వై వి సుబ్బారెడ్డి, రాష్ట్ర ఐటీ శాఖా మాత్యులు గుడివాడ అమర్నాథ్, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున, జివిఎంసి కమిషనర్ సి ఎం సాయికాంత్ వర్మ, పోలీస్ కమిషనర్ త్రివిక్రమవర్మలు శనివారం ఐటీ సెజ్ లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వై వి సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని, అందులో భాగంగా మే 3వ తేదీన మధురవాడలోని వైజాగ్ ఐటీ టెక్ పార్క్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడంతో పాటు... ఆదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు. విశాఖపట్నం అభివృద్ధిలో భాగంగా ఈ డేటా సెంటర్ ద్వారా ప్రత్యక్ష, పరోక్షంగాను దాదాపు 40 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లలో భాగంగా రోడ్లు, పారిశుద్ధ్యం, గ్రీనరీ తదితర ఏర్పాట్లు త్వరతగతిన చేయాలన్నారు. ముందుగా ఆయన భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఇక్కడికి వస్తారని తెలిపారు