జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ బలోపేతానికి చర్యలు - జిల్లా కలక్టర్ సుమిత్ కుమార్

జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ బలోపేతానికి చర్యలు - జిల్లా కలక్టర్ సుమిత్ కుమార్

అల్లూరి సీతారామరాజు జిల్లా: వి న్యూస్: ఏప్రిల్ 28 :-

జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలక్టర్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సుమిత్ కుమార్ ప్రకటించారు.  అందులో భాగంగా ప్రస్తుతం ఉన్న రెడ్ క్రాస్ సొసైటీ కార్యవర్గాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు.  ప్రస్తుత కార్యవర్గం ఆసక్తికరంగా విధులు నిర్వహించక పోవటాన్ని గుర్తించటం జరిగిందన్నారు.   జిల్లాలో గిరిజన ప్రజలకు అవసరమైన సేవలు అందించటం, రక్త నిల్వలు పెంపొందించగలగటంలో ఆసక్తి గల పట్టుదల, నిజాయితీలతో అత్యంత ఉత్సాహకంగా పనిచేయటానికి ముందుకు వచ్చే సభ్యలతో నూతన కార్యవర్గం ఏర్పాటు చేయటానికి నిర్ణయించినట్లు కలక్టర్ వివరించారు.  అందుకు ఆసక్తి గల ప్రస్తుత రెడ్ క్రాస్ జీవిత సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, మీడియా మిత్రుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలక్టర్ తెలిపారు.  వారి నుండి ఎంపిక చేసిన అభ్యర్ధులతో నూతన కమిటీ ఏర్పాటు చేసి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీని బలోపేతం చేయటంతో పాటు రెడ్ క్రాస్ సంస్థ కార్యకలాపాలను విస్తృతం చేస్తామని కలక్టర్ వివరించారు.