దీర్ఘ కాలిక డ్రెయినేజీ సమస్య పరిష్కారం చేయాలని అధికారులకు శాసనసభ సభ్యులు అవంతి ఆదేశాలు
భీమిలి :విశాఖ లోకల్ న్యూస్
తగరపువలస జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు ని ఆనుకొని 1వ వార్డు 2 వ వార్డు కి సంబందించి జాతీయ రహదారి వారు రోడ్డు నిర్మాణం చేసేటప్పుడు అక్కడ డ్రెయినేజీ నిర్మాణం సరైన రీతిలో చేపట్టకపోవడం జరిగింది అందువలన వీధి లలో నుండి వచ్చే డ్రెయినేజీ నీరు రహదారి తో ఆనుకొని ఉన్న రోడ్డు పై చేరి ఆనుకొని రాకపోకలకు ప్రక్కనే ఉన్న నివాస ప్రాంత వాసులకు సమస్య గా ఉంది ఈ విషయంపై మంగళవారం నాడు 1,2 వార్డు నాయకులు అవంతి శ్రీనివాసరావు ని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి విషయం వివరించరూ
భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులైన ముత్తంశెట్టి శ్రీనివాసరావు జాతీయ రహదారి డిప్యూటీ మేనేజర్ జాతీయ రహదారి ఇంజినీరింగ్ అధికారులు జోనల్ కమిషనర్ దానికి సంబంధించిన రెవెన్యూ అధికారులు ను ఈ విషయం పై సర్వే చేసి సమస్య గా ఉన్న ఆ డ్రైనేజీ వ్యవస్థ నీరు రోడ్డు పైకి రాకుండా పక్కన ఒక లైన్ తీసుకుని సమస్య పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది.అవంతి శ్రీనివాసరావు ని కలిసి సమస్య పరిష్కారం చేసే మార్గ ప్రక్రియ కార్యక్రమంలో భీమిలి జోన్ వైసిపి నాయకులు అక్కరమాని రామానాయుడు శిల్లా కరుణాకర్ రెడ్డి జగ్గుపిల్లి ప్రసాద్ చిప్పాడ వెంకటేష్ సాయి మరియు నాయకులు పాల్గొన్నారు.