ఆర్.ఎస్.ఎ. వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన

రక్తదానం మహాదానం.

ఆర్.ఎస్.ఎ. వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన.

మధురవాడ: 

ముఖ్య అతిథులకు హాజరైన పి.హెచ్.సి వైద్య అధికారిని డాక్టర్ ప్రశాంతి,మధురవాడ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నక్కా శ్రీధర్.                                                                                                                                                                                                                                                                          మథర్ థెరిస్సా112వ జయంతిని పురస్కరించుకుని ఆర్.ఎస్.ఎ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగారక్తదాన శిబిరాన్ని లైన్స్ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మధురవాడ ప్రైమరీ హెల్త్ సెంటర్ (పి.హెచ్.సి)వైద్య అధికారిని డాక్టర్ ప్రశాంతి,మధురవాడ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నక్కా శ్రీధర్ పాల్గొన్నారు.కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యఅతిథులు ఆర్.ఎస్.ఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మథర్ తెరిసా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన యువతను అభినందించారు. ఈసందర్భంగా వైద్య అధికారిని డాక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని,రక్తదానం వలన మరో ప్రాణాన్ని కాపాడేవారవుతారని అన్నారు. స్వచ్ఛందంగా యువత రక్తదానం చేయడానికి ముందుకు రావడం గొప్ప విషయమని కొనియాడారు.18 నుంచి 55 సం మధ్యఉన్నవారు రక్తదానికి అర్హులని,రక్తదాత శారీర బరువు 50కేజీలు ఉండాలని అన్నారు.రోగ నివారణ కోసం ప్రమాద సమయంలో శస్త్ర చికిత్సలు జరిగినప్పుడు బాధితుల శారీరంలో తగినంతగా రక్తం లేకపోతే మరోకరిని నుంచి రక్తంని ఎక్కిస్తుంటారని, ఆసందర్భంలో రక్తదాతలు దానం చేసిన రక్తం ఎంతగానో ఉపయోగపడుతుందని యువత విధిగా రక్తదానంని అలవాటు చేసుకోవాలని కోరారు.ఆర్.ఎస్.ఏ వెల్ఫేర్ అసోసియేషన్ మానవతా దృక్పధంతో చేస్తున్న సేవలు అభినందనీయమని కొనిఆడారు. మధురవాడ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నక్కా శ్రీధర్ మాట్లాడుతూ..ఆర్ఎస్ఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ ను ఆదర్శంగా తీసుకొనియువత చెడు మార్గాలను వీడి, సన్మార్గంలో ప్రయాణించాలని. రక్త దానం ప్రతి ఒక్కరు చేయాలని,ఒక నిండు ప్రాణాన్ని అత్యవసర పరిస్థితుల్లో కాపాడిన వారుగా రక్తదానం చేసిన మిగిలిపోతారని అన్నారు. లైన్స్ బ్లడ్ బ్యాంక్ఆర్.ఎస్.ఏ ఆధ్వర్యంలో చేపట్టిన రక్తదాన శిబిరంలో 62 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సునీల్ కుమార్ పోలిమాటి,చీప్ పాట్రాన్ వాసం సంతోష్ కుమార్(మాస్టర్ మణి) కోశాధికారి బుజ్జి ప్రసాద్,గౌరవ అధ్యక్షులు జీలకర్ర గణేష్,గౌరవ సలహాదారులు పెంకి దయానంద్,జాయింట్ సెక్రటరీ సురేష్. ఆర్గనైజింగ్ సెక్రటరీ కెల్లాచిన్న,ఉపకోశాధికారి శశి యాదవ్,బాలుపాత్రో జర్నలిస్ట్, సభ్యులు: అప్పలరెడ్డి,శివారెడ్డి, నరేంద్ర,మనీకుట్టన్, ,మురళి,అలి. దావీదు.ఎం రాజు,.శ్రీను, తదితరులు పాల్గొన్నారు.