చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ ఆలయంలో శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం పూజలు.

చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ ఆలయంలో శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం పూజలు.

మధురవాడ 26: విశాఖ లోకల్ న్యూస్:

మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు మీద కొలువైవున్న శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో ఈరోజు శుభకృత్ నామ సంవత్సరం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణ పక్షం చతుర్దశి తత్కాల అమావాస్య ఆఖరి శుక్రవారం  సందర్భంగా అమ్మవారికి నిత్యార్చనతో పూజలు ప్రారంభించి, ప్రత్యేక కుంకుమార్చన, పుష్పార్చన,  మొదలగు పూజ కార్యక్రమాలు   ఆలయ ప్రధాన అర్చకులు ,పట్నాల హరి ప్రసాద్ శర్మ, హరి చరణ్, హరి స్వామి తదితరులు జరిపించడం జరిగింది, 

మరియు సాయంత్రం అమ్మవారికి పంచామృత సుగంధ జలాభిషేకం జరిపించి, ప్రత్యేకంగా అలంకరించడం జరిగింది, 

మధురవాడ చంద్రంపాలెం వాస్తవ్యులు పి.వి.జి.అప్పారావు, యశోద దంపతులు  ఆర్ధిక సహాయంతో ఈరోజు ఉదయం  పులిహోర ప్రసాదమును ఏర్పాటు చేయడం జరిగింది, మరియు మధురవాడ భరత్ నగర్ వాస్తవ్యులు శ్రీ మామయ్య, శ్రీమతి దమయంతి దంపతులు సాయంత్రం తీపి బూంది  ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది, ఆ ప్రసాదంను భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు  పంపిణీ చేయడం జరిగింది, అమ్మవారి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి  ప్రత్యేక పూజలలో పాల్గొని అమ్మవారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు, శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా కొమ్మాది వాస్తవ్యులు శ్రీ సియ్యాద్రి అప్పారావు, శ్రీమతి సింహాచలం దంపతులు, శ్రీ సియ్యాద్రి అబద్దం శ్రీమతి కొండమ్మ దంపతులు ఆర్ధిక సహాయంతో ఆలయ ప్రాంగణంలో  (300) మూడు వందల మంది భక్తులకు అన్నసంతర్పణ చేయడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో   శ్రీ దుర్గాలమ్మ ఆలయ కమిటీ అధ్యక్షులు పిళ్లా సూరిబాబు, ఉపాధ్యక్షులు పి.వి.జి.అప్పారావు,  సెక్రటరీ నాగోతి తాతారావు, కోశాధికారి పిళ్లా శ్రీనివాసరావు, సభ్యులు పిళ్లా వెంకటరమణ,  పోతిన పైడిరాజు, యస్.ఆర్.బాబు, పిళ్లా మోహన్ శివ కృష్ణ, కేశనకుర్తి అప్పారావు, దుక్క వరం, పోతిన శివ, బంక వాసు, పీస రమణ,నాగోతి అప్పలరాజు,గ్రామ పెద్దలు పీస రామారావు, జగుపిల్లి నాని, బి. నాని, పిళ్లా సత్యనారాయణ, ముఖ్య సభ్యులు పిళ్లా అప్పన్న, పి.సూరి పాత్రుడు, యమ్. ఆనంద్,   యస్.రమేష్, జి. సింహాచలం, పిళ్లా రాజు, జి.రామారావు తదితరులు పాల్గొన్నారు.