అద్వాణ్ణంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన బాలికల వసతి గృహాలు!అధికారుల తీరుపై మండిపడ్డ కార్పొరేటర్ గంటా అప్పలకొండ.
భీమిలి జోన్:
ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతి గృహలమీద నమ్మకంతో తల్లిదండ్రులు తమ పిల్లలను హాస్టల్లో చేర్పిస్తే అధికారుల నిర్లక్ష్యం కారణంగా బాలికలు నరకం చూస్తున్నారని ఇదేనా బావిభారత పౌరులకు మీరిచ్చే గౌరవమని జీవిఎంసీ భీమిలి జోన్ 3వ వార్డు కార్పొరేటర్ గంటా అప్పలకొండ అధికారుల తీరుపై మండిపడ్డారు.
భీమిలి జోన్ 3వ వార్డులో ఉన్న సమీకృత సంక్షేమ బాలికల వసతి గృహాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, టెక్కలి నియోజకవర్గం పరిశీలకులు గంటా నూకరాజుతో కలసి ఆమె శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేసి విస్తుపోయారు. 10వ తరగతి వరకు చదువుకొనే అమ్మాయిలు 150 మంది ఉన్న వసతి గృహం ఇలా ఉంటుందా..? అని కుమిలిపోయారు. నిరుపేద ఇంట్లో కూడా అమ్మాయిలు ఉంటే కనీస సౌకర్యాలు అనేవి ఉంటాయని అలాంటిది ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా కూడా ఇంత అద్వాణ్ణంగా మౌలిక సౌకర్యాలు ఉన్నాయంటే అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్ధమవుతుందని కార్పొరేటర్ గంటా అప్పలకొండ అన్నారు. అమ్మాయిలు స్నానం చేసే బాత్ రూంలుగాని, మరుగుదొడ్లు గాని, చుట్టూ ఉండే పరిసరాలు గాని ఇంత అద్వాణ్ణంగా ఉంటే హాస్టల్ వార్డెన్ గాని, అధికారులు గాని ఎందుకింత నిర్లక్ష్యంగా ఉన్నారని నిలదీశారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా విద్యకు సంబంధించి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతుందని కానీ నేడు ఈ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన తరువాత ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తుందా..? లేక అధికారుల నిర్లక్ష్యం ఎక్కువగా ఉందా..? అనే అనుమానం వస్తుందని అన్నారు. ఇక్కడ ఉన్న బాలికల బాధలు చూస్తుంటే మహిళా కార్పొరేటర్ గా నాకే సిగ్గేస్తుందని అన్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరవాలని, రెండువారాల్లోగా సమీకృత సంక్షేమ బాలికల వసతి గృహాల మౌలిక వసతుల్లో మార్పులు రావాలని అలాకాని యెడల నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే ఎక్కడ రిపోర్ట్ చేయాలో అక్కడ చేస్తానని కార్పొరేటర్ గంటా అప్పలకొండ హెచ్చరించారు.