ఢిల్లీ లో తలక్ తోర ఇండోర్ స్టేడియంలో రాష్ట్రీయ ఓబిసి మహా సభలు


 న్యూ ఢిల్లీ:విశాఖ లోకల్ న్యూస్

ఢిల్లీ లో తలక్ తోర ఇండోర్ స్టేడియంలో రాష్ట్రీయ ఓబిసి మహా సభలు

రాష్ట్రీయ ఓబిసి మహా సంఘ  ఆధ్వర్యంలో భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల  బిసి సంఘాలు ఢిల్లీ లో తలక్ తోర ఇండోర్ స్టేడియంలో సమావేశంలో నిర్వహించారు ఈ ఆంద్రప్రదేశ్ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ కేశన శంకర రావు మాట్లాడుతూ 

బిపి మండల్ ఇచ్చిన నివేదికను తక్షణమే అమలు చేయాలని కోరారు బిసిలకు 27% రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని కేంద్రప్రభుత్వం ను డిమాండ్ చేశారు. అలాగే బిసి కులాల జనగణనను చేయించాలని మరియు ఓబీసీ  లపై విధించిన క్రీమీ లేయర్ యొక్క చట్టబద్ధమైన షరతును తక్షణమే రద్దు చేయాలి మరియు రద్దు చేసే వరకు నాన్ క్రీమీ లేయర్ పరిమితిని 20 లక్షల రూపాయలకు పెంచాలి.ఓబీసీ ఉద్యోగులకు ప్రమోషన్‌లో రిజర్వేషన్లు వర్తింపజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర స్పీకర్ జస్టిస్ ఈశ్వరయ్య  , గొర్లె శ్రీనివాస నాయుడు  ప్రసంగించారు

ఉత్తరాంద్ర నుండి ఉత్తరాంద్ర పొలిటికల్ జె.ఎ. సి కన్వీనర్ గొర్లె శ్రీనివాస నాయుడు, విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు  పల్లా రమణ ఆధ్వర్యంలో ఉత్తరాంద్ర నుండి సుమారు 20మంది బిసి నాయకులు పాల్గొన్నారు .