పీఎం పాలెం ట్రాఫిక్ ఎస్సై మురళీకృష్ణ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్
విశాఖ జిల్లా మధురవాడ కొమ్మది జంక్షన్ సోమవారం నాడు పీఎం పాలెం ట్రాఫిక్ ఎస్సై మురళీకృష్ణ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు మురళీకృష్ణ మాట్లాడుతూ . కరోనా కారణంగా ఆటోలు, కొన్ని వాహనాలు తనిఖీ చేయడం ఆపడం జరిగింది సోమవారం నుండి పై అధికారులు ఆదేశాల మేరకు తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు.
రిజిస్ట్రేషన్ లేని ఆటోలు తిరుగుతూ ఉండడంతో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి తనిఖీల్లో ఆటోలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సురెన్స్, యూనిఫాం తప్పనిసరిగా ఉండాలని ఆటోడ్రైవర్లకు పోలీసులు సూచనలు చేశారు. అంతేకాకుండా ఆటో నడుపుతున్న సమయంలో ట్రాఫిక్ నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు.. లేకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ట్రాఫిక్ ఎస్ఐ మురళీకృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.