అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ భీమిలి శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ భీమిలి శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం:-

భీమిలి:

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ భీమిలి శాఖ ఆధ్వర్యంలో స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్ SFD కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా గొట్టిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో వృక్షమిత్ర మొక్కలనాటడం జరిగింది.ఈ కార్యక్రమంలో విభాగ్ SFD కన్వీనర్ లొడగల అచ్చిబాబు పాల్గొన్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా కూడా ABVP ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తుంది అని జన్మంతా మోసే నేల తల్లి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము,కనీసం ఒక్క చిన్న మొక్కని నాటి నేలమ్మ ఆయుష్యు ను కాపాడి కొంచెం అయినా రుణం తీరుచుకుందాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ అప్పారావు ,బుత్తల గురునాయుడు, బుత్తల వంశీ,చందు,సిద్దు తదితరులు పాల్గొన్నారు.