కొమ్మాది విజయం స్కూల్ ను సందర్శించిన రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ చీఫ్ ఇంజనీర్ బి సుబ్బారెడ్డి
మధురవాడ : విశాఖ లోకల్ న్యూస్
రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ చీఫ్ ఇంజనీర్ బి సుబ్బారెడ్డి విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా కొమ్మాది విజయం స్కూల్ ను సందర్శించారు. స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ కే విజయలక్ష్మి , సుబ్బారెడ్డి కి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ధ్ధ్యానం యోగాతో ఒత్తిడిని జయించడం ఎలా అన్న అంశంపై విద్యార్థులను ఉద్దేశించి సుబ్బారెడ్డి కీలక ఉపన్యాసం చేశారు. మెడిటేషన్ ఆవశ్యకతను విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు.ప్రతి విద్యార్థి ఒత్తిడిని జయించి సమగ్ర ప్రణాళికతో ముందుకు పయనిస్తే తమ లక్ష్యాలను చేరుకోగలుగుతారని సూచించారు.విద్యారంగంలో ప్రిన్సిపల్ డాక్టర్ కె విజయలక్ష్మి అందిస్తున్న సేవలు కీర్తించ దగ్గవని పలువురు వక్తలు ఆమెను అభినందించారు. అనంతరం ముఖ్య అతిథి సుబ్బారెడ్డి ని స్కూల్ యాజమాన్యం ఘనంగా సత్కరించింది.