మొగదారమ్మ కాలనీ లో సమస్యలు పరిష్కారం చేయండి. సీపీఎం.

మధురవాడ:విశాఖ లోకల్ న్యూస్

మొగదారమ్మ కాలనీ లో సమస్యలు పరిష్కారం చేయండి. సీపీఎం.

జివిఎంసీ 7 వ వార్డు పరిధిలో ఉన్న మొగ దారమ్మ జే ఎన్ ఎన్ యు ఆర్ ఎం కాలని లో వున్న ప్రజలు త్రాగు నీరు తో పాటు తీవ్ర మైన పారిశుధ్యం సమస్యతో బాధపడుతున్నారనీ సీపీఎం మధురవాడ జోన్ కమిటీ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సమస్యలపై సోమవారం జీవీఎంసీ జోనల్ కార్యాలయం ప్రజావాణి లో కాలని ప్రజలతో కలిసి జోనల్ కమిషనర్ బి రాము కి వినతి పత్రాలు అందచేశారు.అనంతరం డి అప్పలరాజు, పి రాజు కుమార్ మాట్లాడుతూ సుమారు 10 సంవత్సరాల కాలం పైబడి కాలని ప్రజలు త్రాగు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అన్న పనులు పూర్తి చేసి, ట్యాంకు లోపలికి నీరు వచ్చే పైపు లైన్ పనులు పూర్తి చేస్తే అందరిళ్లకు కొళాయి ఇవ్వొచ్చని అన్నారు. జీవీఎంసీ వారి నిర్లక్ష్యం వలన ఈ చిన్న పని కూడా పూర్తి  చేయలేదన అన్నారు. అంతేకాకుండా భూగర్భ కాలువల మ్యాన్ హోల్స్ నిండిపోయి మురుగునీరు బయట ప్రవహిస్తుందని తెలియజేశారు. పారిశుద్ధ్య కార్మికులతో శుభ్రం చేయకపోవడం వలన మురుగు నీరు చెత్త కలిసిపోయే తీవ్ర దుర్గంధం వెదజల్లుతుందని తెలియజేశారు. ఇంటిలోనూ బయట కూడా వుండ లేక తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.సమస్యలు పరిష్కారం చేయకపోతే జోనల్ కార్యాలయం ను ముట్టడిస్తామని హెచ్చరించారు.పి శ్రీనివాస రావు, జై సూర్య, ఈ కేసవా , శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.