మీసేవ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించాలని జె సి విశ్వనాధన్కి విజ్ఞప్తి చేసిన విశాఖ జిల్లా మీసేవ ఆపరేటర్లు.
విశాఖ:
వారంలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ఎక్కడైనా మీసేవకి వెళ్లొద్దు అని చెప్తే నా దృష్టికి తీసుకు రండి జేసీ విశ్వనాధన్,
ఉన్నత అధికారులు ఆదేశాలు లేకుండానే సచివాలయ సిబ్బంది సొంత నిర్ణయాలతో వాలంటీర్లతో ప్రజలను భయ బ్రాంతులకు గురిచేస్తున్నారు.
విశాఖ జిల్లాలో మీసేవ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించాలని జె సి విశ్వనాధన్ ని కలిసి ఆపరేటర్ల కు తహసీల్దార్ ల సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు నుండి ఎదురవుతున్న ఇబ్బందులను గూర్చి మీసేవ ఆపరేటర్ల ఆవేదనను వెళ్ళబుచ్చారు. మీసేవ కు వెళ్ళవద్దని సచివాలయంలోనే దరఖాస్తులు చేసుకోవాలని ఆలా కాకుండా మీసేవలో దరఖాస్తుచేస్తే ఆసర్టిఫికెట్లు చెల్లవని ప్రత్యక్షంగా సచివాలయ సిబ్బంది వాలంటీర్లతో తప్పుడు సంకెతాలను ప్రజలకు చెప్పి ప్రజలను భయ బ్రాంతులకు గురిచేస్తున్నారని, అలా వాలంటీర్ లు ప్రతీ ఇంటికి వెళ్లి మీసేవ లో దరఖాస్తు చేస్తే మీకు సంక్షేమ పథకాలు ఆగిపోతాయని భయ పెట్టటంవల్ల ప్రజలు మీసేవకు రావటం మానేశారని ఎవరో ఒకరిద్దరు వచ్చి దరఖాస్తు చేసుకుంటే అవి తహసీల్దార్ కార్యాలయం వద్ద తిరస్కరించి సచివాలయం లో దరఖాస్తు చేసుకొమ్మని తహసీల్దార్ కార్యాలయం లో చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. మీసేవలో దరఖాస్తు చేసినవి 30రోజులవరకు మంజూరుచెయ్యటం లేదని అదే సచివాలయం లో ఎటువంటి దరఖాస్తు లు అయిన వారం లోపే మంజూరుచేస్తున్నారని ఈవిధంగా తహసీల్దార్ లు సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు మీసేవ ఆపరేటర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మీసేవ ఆపరేటర్లు కు ఎదురవుతున్న ఇబ్బందులను జేసీ విశ్వనాధన్ కి తెలుపుతూ మీసేవ లో చేస్తున్న ధరకాస్థులను అంగీకరించాలని, సచివాలయ సిబ్బంది, వాలంటీర్ లు ప్రజలకు మీసేవ కు వెళ్లొద్దు అని చెప్పి ప్రజలను భయపెట్టే విషయాన్ని నిరోధించాలని, సచివాలయ సిబ్బంది, వాలంటీర్ లు చెబుతున్న తప్పుడు సంకెతాలు మానవ హక్కుల ఉల్లంగనకిందకు వస్తుందని కావున మీసేవ ఆపరేటర్ల సమస్యలను పరిష్కరించాలని జె సి విశ్వనాధన్ ని విజ్ఞప్తి చేసారు.
మీసేవ ఆపరేటర్ల సమస్య పై జేసీ విశ్వనాధన్ శానుకూలంగా స్పందించి ప్రభుత్వమైన, అధికారులైన మీసేవ ఆపరేటర్ల ను ఇబ్బందులకు గురిచేసే ఆలోచన లేదని తహసీల్దార్లకు మీసేవ దరఖాస్తులు, సచివాలయ దరఖాస్తులు ఒకే విధంగా చూడాలని సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు మీసేవకు వెళ్లొద్దని చెబుతు భయపెడుతున్న వారిని నిరోధించాలని ,ఆదేశాలు జారీచేసారు. మీసేవ ఆపరేటర్లను ఒక వారం చూడండి మరల సమస్య వస్తే నా దృష్టికి తీసుకురండి వారిపై తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారని తెలిపారు.ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా మీసేవ ఆపరేటర్ల యూనియన్ నాయకులు నాగు, మీసేవ ఆపరేటర్లు పాల్గొన్నారు.