నాలుగో వార్డ్ డు చేపలుప్పాడ లో ఆకట్టుకుంటున్న అన్న క్యాంటీన్ వినాయక మండపం
చేపలుప్పాడ:విశాఖ లోకల్ న్యూస్:
భీమునిపట్నం: జీవీఎంసీ నాలుగో వార్డ్ పరిధి చేపలుప్పాడ లో వినాయక ఉత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్ మండపం అందర్నీ ఆకట్టుకుంటుంది. చేపలుప్పాడ మాజీ సర్పంచ్ శ్రీ కారి అప్పారావు గారు, మాజీ ఎంపీటీసీ సభ్యులు చీపుళ్ళ శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో స్థానిక సరదా యూత్ బాయ్స్ ఈ మండపాన్ని అచ్చు అన్న క్యాంటీన్ మాదిరిగా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మండపానికి వచ్చిన భక్తులకు సుమారు వెయ్యి మందికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం , రాత్రి భోజనాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జీవీఎంసీ నాలుగో వార్డ్ టిడిపి అధ్యక్షుడు, భీమిలిమండలం మాజీ ఎంపీపీ శ్రీ పాసి నర్సింగరావు గారు, తెలుగు యువత నియోజవర్గ ఉపాధ్యక్షుడు పాసీ త్రినాధ్ కుమార్ హాజరై గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆన్న క్యాంటీన్లో అల్పాహారం, భోజనాలను లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక ఉత్సవ నవరాత్రుల సందర్భంగా ఆధ్యాత్మిక తో పాటు పేదలకు తొమ్మిది రోజులపాటు అల్పాహారం భోజనాలను ఉచితంగా పంపిణీ చేయాలని చేపలుప్పాడ నాయకులు యువకులు తీసుకున్న నిర్ణయం హర్షనీయమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చేపలుప్పాడు మాజీ సర్పంచులు శ్రీ కారి అప్పారావు గారు, మైలపల్లి రాము గారు, మాజీ ఎంపీటీసీ సభ్యులు చీపుల్ల శ్రీనివాసరావు గారు, కారి రాములు గారు, గ్రామ పెద్దలు,నాయకులు, యువకులు, పిల్లలు భక్తులు ,పాల్గొన్నారు. బిజెపి యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ధోని నాగరాజు, జనసేన నాయకులు ఉమ్మడి రాజు తదితరులు, అన్న క్యాంటీన్ మండపాన్ని సందర్శించి ఉచిత అన్నదానం చేస్తున్న వారిని అభినందించారు.