వీరబ్రహ్మేంద్రస్వామి సేవా సంఘ సర్వ సభ్య సమావేశం.

వీరబ్రహ్మేంద్రస్వామి సేవా సంఘ సర్వ సభ్య సమావేశం.

మధురవాడ:

శ్రీ శ్రీ శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సేవా సంఘ సభ్యులు మధురవాడ స్వతంత్ర నగర్ లో నూతనంగా నిర్మిస్తున్న ఆలయ ప్రాంగణంలో ఆ సంఘం అధ్యక్షుడు పొన్నాడ సాయి అద్యక్షతన సర్వ సభ్య సమావేశం ను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  వీరబ్రహ్మేంద్రస్వామి శివాలయం,మానసదేవి ఆలయంను నిర్మించనున్నట్లు  తెలియజేస్తూ ఉత్తరాంధ్రా లో మానసదేవీ అమ్మవారి ఆలయం  మొదటి సారిగా నిర్మాణం స్వతంత్ర నగర్ లో నిర్మిస్తుండడంతో అందరూ భాగస్వాములు అయి ప్రతీ ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని కోరారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన స్ధానిక నాయకురాలు తమ్మినేని వరలక్ష్మీ సుదర్శనరావు మాట్లాడుతూ ఈ గ్రామంలో  వీరబ్రహ్మేంద్రస్వామి శివాలయం,మానసదేవీ ఆలయం నిర్మాణ తలచడం శుభ పరిణామమని,ఈ ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు.సమావేశానికి సభ్యులందరూ హాజరైనందుకు పొన్నాడ సాయి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సమావేశంలో శ్రీనివాసరావు,చుక్క వీరాచారి, పొన్నాడ బ్రహ్మాజీ,తాలబత్తుల అప్పలరాజు,పైడి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.