ఏపీలో ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించాలి: రాష్ట్రపతి, ప్రధానమంత్రి కార్యాలయానికి తెలుగు శక్తి లేఖలు
ఆంధ్రప్రదేశ్:
సభాపతి స్థానంలో కూర్చునే అర్హత A-2 విజయసాయి రెడ్డి కి లేదు
తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి. రామ్ డిమాండ్
ఆంధ్రప్రదేశ్ లో తక్షణమే ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలని, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తూ సోమవారం.. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి కార్యాలయాలకు తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ లేఖ రాశారు. తగరపువలస లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఉత్తర కోస్తా ప్రజలు ఎవరూ పరిపాలన రాజధానిని కోరుకోక పోయినా.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకు వచ్చారన్నారు. ఆంధ్రప్రదేశ్ అసలు భారత దేశంలో ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పరిస్థితులను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి న్యాయం చేయాలని తెలుగు శక్తి డిమాండ్ చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో తక్షణమే.. ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలని కూడా డిమాండ్ చేశారు. మొత్తం మీద ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన లో ఉత్పన్నమైన రాజకీయ సంక్షోభం నుంచి ఆంధ్రప్రదేశ్ ను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు రాసలీలలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి ఏమాత్రం పాలించే హక్కు లేదన్నారు. రౌడీలు, గుండాలు, బూతు పురాణాలు కొనసాగించేవారికి నిలయంగా ఆ పార్టీ మారిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అనేక కేసులలో నిందితుడుగా ఉన్న "A-2 " విజయసాయి రెడ్డి కి రాజ్యసభలో సభాపతి స్థానంలో కూర్చునే అర్హత లేదన్నారు. తీవ్ర ఆర్థిక నేర ఆరోపణలపై 16 నెలలు జైలుకు వెళ్లి బెయిల్ పై ఉన్న ఆర్థిక ఉగ్రవాదిని సభాపతి స్థానంలో కూర్చోబెట్టారoటే 75 ఏళ్ల స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తే సభ్య సమాజానికి మనం ఏం సందేశం ఇచ్చినట్టు అవుతుందని కేంద్రాన్ని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ ప్రశ్నించారు.