వీరేంద్ర కుమార్ ను కలసిన తూర్పుకాపు నాయకులు


 న్యూ ఢిల్లీ:విశాఖ లోకల్ న్యూస్

తూర్పుకాపుల నాయకులను ఢిల్లీలో  కేంద్ర  సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి  డా వీరేంద్ర కుమార్  దగ్గరకు తీసుకెళ్లిన  రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు  

 పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ  శ్రీ జీవీఎల్ నరసింహారావు  ఆధ్వర్యంలో డిల్లీలో కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి శ్రీ డా. వీరేంద్ర కుమార్ ని కలసిన తూర్పుకాపు నాయకులు  గాజువాక బీజేపి ఇన్ఛార్జ్  కరణంరెడ్డి నరసింగరావు , ఉత్తరాంధ్రా తూర్పుకాపు సంఘం అధ్యక్షులు గొర్లె శ్రీనివాస నాయుడు ,వివిద జిల్లాల నుండి వచ్చిన తూర్పుకాపు సంఘం నాయకులు  ఓబీసీ కన్వీనర్ సరిపిడకల రామారావు ఆంద్రప్రదేశ్ తూర్పుకాపు సంక్షేమ సంఘం మేరగని ప్రసాద్  భీమవరం  బలజ్యోతి మూర్తి   గుంటూరు జిల్లా కమిటీ  వంజరాపు దేవి ప్రసాద్   ,కోటకోటి ప్రసాద్ తదితరులు. ఈ సందర్బంగా వారు  జీవీఎల్ నరసింహరావు  మంత్రి కి  తూర్పుకాపుల నాయకులను పెరు పేరున కేంద్రమంత్రి కి పరిచయం చేసి వారి స్థితిగతులు వివరించారు  తూర్పుకాపు/ గాజులకాపులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 50 లక్షలు పైగా ఉన్నారు వీరు వివిద జిల్లాల్లో వృత్తి రీత్యా నివాసం వుంటు ఉత్తరాంద్ర జిల్లాలో మినహా ఇతర జిల్లాలు సుమారు ఇరవై లక్షల మంది తూర్పుకాపులకు ఉన్నారు.  ఉత్తరాంధ్రా జిల్లాలలో వుంటున్న తూర్పుకాపులకు ఇస్తున్న బిసి-డి ఒబిసి సర్టిఫికేట్లను రాష్ట్రంలో గల మిగతా 10 జిల్లాలలో వుంటున్న వారందరికీ ఇవ్వాలని కోరుతూ దక్షిణాది రాష్ట్రాల విప్  రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు  మంత్రి  దృష్టికి తీసుకొని వెల్లి వినతి పత్రం ఇచ్చారు. కేంద్ర మంత్రి  రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తూర్పుకాపు లను ఓబీసీ జాబితా లో చేర్చలని సిఫార్స్ చేసి కేంద్రానికి పంపిమ వెంటనే కేంద్రప్రభుత్వం తూర్పుకాపు/గాజుల కాపులకు లకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు  ఎన్నో యేల్లగా వున్న సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పినందుకు తమ చిరకాల వాంచను నెరవేరుస్తున్నందుకు తూర్పుకాపు సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు  జి వి ఎల్ నరసింహా రావు కి  తెలియజేస్తున్నామని గొర్లె శ్రీనివాస నాయుడు అన్నారు.