ఎట్టకేలకు పీఎం పాలెం పిఎస్ నుండి కదిలిన సిఐ రవికుమార్
మధురవాడ:విశాఖ లోకల్ న్యూస్
విశాఖ రేంజ్ పరిధిలో ఎనిమిది మంది సీఐ లను బదిలీ చేస్తూ డీఐజీ హరికృష్ణ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. చోడవరం పిఎస్ లో ఉన్న ఆర్. వి. వి. ఎస్. ఎస్. సిహెచ్. శేఖ రరావును అనకాపల్లి డిఎస్బికి, ఏ. ఎస్. ఆర్ జిల్లా, చింతపల్లి సర్కిల్ లో ఉన్న తల్లపుడి శీను ని అనకాపల్లి ట్రాఫిక్ విభాగానికి, శ్రీకాకుళం డీఎస్బిలో ఉన్న బమ్మిడి శ్రీనివాసరావును అనకాపల్లి జిల్లా, చోడవరం అర్బన్ పిఎస్ కు, విశాఖ సిటీ, పిఎంపాలెం పిఎస్ లో ఉన్న ఏ. రవికుమార్ ను అనకాపల్లి రూరల్ కి, అక్కడ ఉన్న జీ. శ్రీనివాసరావును విశాఖ రేంజ్ విఆర్ కి, అనకాపల్లి టౌన్-2లో ఉన్న కె. అప్పలనాయుడును అనకాపల్లి జిల్లా డిఎస్బి- 2 కు, విశాఖ రేంజ్ విఆర్ లో ఉన్న నరసింహారావును విశాఖ సిటీకి బదిలీ చేశారు. ఇదిలా ఉండగా పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సిఐగా విధులు నిర్వహిస్తున్న ఏ రవికుమార్ కు గతంలో మూడు డివోలు వచ్చినప్పటికీ అక్కడి నుండి అతనిని కదిలించలేకపోయారు. ముఖ్యంగా స్థానిక అధికార పార్టీ నాయకుడు మంత్రిగా ఉండడంతో అప్పటి సిపి మనిష్ కుమార్ సిన్హా, రవికుమార్ కి బదిలీ ఆర్డర్ ఇచ్చినప్పటికీ అతనిని ఆ స్టేషన్ నుండి ట్రాన్స్ఫర్ చేయలేకపోయారు. ఈ తరుణంలో సదరు అధికార పార్టీ నాయకునికి మంత్రి పదవి కాలం ముగియడంతో ఆయన సిఫార్సు పనిచేయలేనట్టు తెలిసింది. సిఐల బదిలీల్లో రవికుమార్ పేరు ఉండడంతో పోలీసు వర్గాల్లో ఇది చర్చాన్సియంగా మారింది. ఏది ఏమైనా పీఎం పాలెం పోలీస్ స్టేషన్ కన్నా, అనకాపల్లి రూరల్ అన్ని విధాలా బాగుంటుందని, మంచి స్టేషన్ కి ఆయనకి పోస్టింగ్ ఇచ్చారని కొందరు పోలీసు అధికారులు గుసగుసలాడుకుంటున్నారు.