వీధిలైట్ల సమస్య పరిష్కారం దిశగా ఐదో వార్డ్

వీధిలైట్ల సమస్య పరిష్కారం దిశగా ఐదో వార్డ్

వీధిలైట్ల సమస్య పై ప్రత్యేక దృష్టి: కార్పొరేటర్ మొల్లి హేమలత

మధురవాడ : జీవీఎంసీ ఐదో వార్డ్ లో చాలా కాలంగా వేధిస్తున్న వీధిలైట్ల సమస్య పరిష్కారం అయ్యేలా కార్పొరేటర్ మొల్లి హేమలత దగ్గరుండి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పరదేశి పాలెం, బోరవానిపాలెం, మారికవలస, శారదా నగర్ ఏరియాలలో చాలా కాలం నుండి ఉన్న వీధిలైట్లు సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మొల్లి హేమలత మాట్లాడుతూ వార్డులో చాలాచోట్ల వీధిలైట్ల సమస్య ఎక్కువగా ఉండడం వలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని వెంటనే సంబంధిత అధికారులకు సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టాలని తెలపగా గత ఐదు రోజుల నుండి యుద్ధ ప్రాతిపదికన ఏరియాల వారిగా వీధిలైట్లను అమర్చడం జరుగుతుందని తెలిపారు. వార్డులో ఇంకా మిగిలి ఉన్న ఏరియాలలో  మరో వారం రోజులలో వీధిలైట్ల సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ వర్క్ ఇన్స్పెక్టర్ కృష్ణ ,దేవుడు, రామనాయుడు, మన్యాల హనుమంతు తదితరులు పాల్గొన్నారు.