వెల్లంకి గ్రామంలో అంతర్జాతీయ మానవహక్కుల సంఘం ఇండియా అత్యవసర సమావేశం.
విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం వెల్లంకి గ్రామంలో గల విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం వెల్లంకి గ్రామంలో గల శుబ్బలక్ష్మి నగర్ లో పట్నాయ్కుని జానకేశ్వర రావు శుభ బలరాం నిలయం లో అంతర్జాతీయ మానవహక్కుల సంఘం ఇండియా.. అత్యవసర సమావేశం:- విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కింజరాపు సూర్య నారాయణ అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశంనకు ముఖ్య అతిథులుగా జాతీయ ఉపాధ్యక్షులు బి. వి. యన్. పాత్రో జాతీయ సీనియర్ కార్యదర్శి బండారు అనిల్ కుమార్ ఉత్తరాంధ్ర కార్యదర్శి కొత్తల అరుణ్ ప్రసాద్ కొత్తలంక రమేష్ శర్మ మొ. వారు పాల్గొనిరి. ఈ సమావేశంలో ఆరికతోట చంద్రమౌళికి జాతీయ స్పోక్స్ పర్సన్ గా కంఠిమహంతి శివప్రసాద్ ని జాతీయ కార్యదర్శి గా పి.వి.వి. ప్రసాదరావుని జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శి గా డబ్బీరు ప్రశాంతిని జాతీయ మహిళా కార్యదర్శి గా కోటమహంతి వెంకటచలం జాతీయ సహకార్యదర్శిగా అర్జునమహంతి రామకృష్ణ లైఫ్ మెంబర్ గా కోటమహంతి కుమార్ ని జాతీయ సహకార్యదర్శిగా శ్రీ కె. సత్యనారాయణ బి. వి. యన్. పాత్రో బండారు అనిల్ కుమార్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేసిరి.. అంతర్జాతీయ మానవహక్కుల సంఘం జాతీయ నాయకులు గా తమకు నియామక పత్రాలు జారీ చేసిన అంతర్జాతీయ అధ్యక్షులు మరియు చైర్మన్ జి. పి. శుక్లా కి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తమకు అప్పగించిన బాధ్యతలను త్రికరణశుద్ధిగా పాటించి హక్కులకు భంగం వాటిల్లే వారి కి చేదోడు వాదోడు గా వుండి కుల మత ప్రాంతీయ భాషా లింగ బేధాలు లేకుండా అందరికీ సమ న్యాయం చేయటానికి కృషి చేస్తామని ఎ. చంద్రమౌళి , కె. శివప్రసాద్ , పి.వి.వి. ప్రసాదరావు తెలిపారు.