ప్రజలు సహకారం అందిచండి ! సమస్యలు పరిష్కారం కోసం పోరాటాలు ఉదృతం చేస్తాం.
విశాఖ,మధురవాడ:
విశాఖలో నిర్వహించనున్న సీపీఐ రాష్ట్ర మహాసభలు జయప్రదం చెయ్యండి. ఆగస్టు 26, 27, 28 తేదీల్లో విశాఖ నగరంలో నిర్వహించనున్న సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 27 వ మహాసభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం పార్టీ శ్రేణులతో కలసి జిల్లాలోని భీమిలీ నియోజకవర్గం పరిధిలోని మధురవాడ కళానగర్ గ్రామంలో ఇంటింటి కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. 48 ఏళ్ల అనంతరం విశాఖ నగరంలో రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నామని, ప్రజలంతా తమకు తోచిన రీతిలో మహాసభల విజయవంతానికి ఆర్థికంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రతి ఇంటికీ వెళ్లి విరాళాలు సేకరించారు.అనంతరం పైడిరాజు మాట్లాడుతూ...ప్రజల పక్షాన నిత్యం పోరాటాలు నిర్వహిస్తున్న పార్టీ మహాసభలకు అడిగిన వెంటనే స్వచ్చందంగా తమకు తోచిన రీతిలో ప్రజలు సహకరించడం సంతోషాన్నిస్తోందని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు విశాఖ నగరం సిరిపురం జంక్షన్లో గల వి ఎం ఆర్ డి ఎ చిల్డర్న్స్ ఏరినా వేదికగా జరుగనున్న రాష్ట్ర మహాసభల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై చర్చించి భవిష్యత్తు కార్యక్రమాలను రూపొందించనున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మధురవాడ ఏరియా కార్యదర్శి వి సత్యనారాయణ, పి రమణ, ఎం త్రినాధ్, కళానగర్ గ్రామ పెద్దలు ఎన్ రాము, అప్పలరాజు, నాయుడు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.