సాగర తీర స్వచ్చత భారత్ మిషన్ లో తెలుగు దేశం నాయకులు.

సాగర తీర స్వచ్చత భారత్ మిషన్ లో తెలుగు దేశం నాయకులు.

విశాఖ తూర్పు:

స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా ఉదయం జీవిఎంసి వారు నిర్వహించిన విశాఖ నుండి భీమిలి వరకు ఉన్న బీచ్ లో 28 కిలోమీటర్ల పొడవున 40 ప్రాంతాలను గుర్తించి 25000 మందితో సముద్ర తీరంను పరిశుభ్రంగా చేయుటకు ఏర్పాటు చేసిన  కార్యక్రమంలో విశాఖ తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు, టీడీపీ జీవిఎంసి ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు మరియు జీవీఎంసీ 2వ వార్డు కార్పొరేటర్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గాడు చిన్నికుమారి లక్ష్మి మరియు తెలుగు దేశం పార్టీ కార్పొరేటర్లు  తెలుగు దేశం నాయకులు జాలారిపేట వద్ద  బీచ్ ను శుభ్రం చేశారు.

ఈ సందర్బంగా గాడు చిన్నికుమారి లక్ష్మి మాట్లాడుతూ విశాఖ లో జీవిఎంసి వారు 28 కిలో మీటర్ల  పొడవున  బీచ్ ను పరిశుభ్రం చేయుటకు ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో, విశాఖ నగర పౌరులుగా బాధ్యతగల ప్రజా ప్రతినిధులు గా తెలుగుదేశం కార్పొరేటర్ మరియు  మా ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు. అదేవిధంగా జీవీఎంసీ కమిషనర్ మేయర్ వివిధ ప్రాంతాల నుండి సముద్రంలో కలుస్తున్న వ్యర్ధాలను మురుగునీరును కట్టడి చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు . మన బీచ్ ను పరిశుభ్రంగా ఉంచుకోవటం నగర పౌరులందరూ  బాధ్యతగా భావించాలని , బీచ్ లో ఎటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలను, చెత్తను వేయకుండా ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జీవిఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు, గంధం శ్రీనివాసరావు, కార్పొరేటర్లు  పల్లా శ్రీనివాసరావు, నొల్లి నూకరత్న, గొలగాని మంగ వేణి,బొండా జగన్ ,రౌతు శ్రీనివాస్, బల్ల శ్రీనివాస రావు, పిల్ల మంగమ్మ, శరగడం రాజశేఖర్, ముక్కా శ్రావణి,గొలగాని వీరారావు ,గోడె  విజయలక్ష్మి మరియు సీనియర్ నాయకులు  మొల్లి లక్ష్మణరావు, పిల్ల వెంకట్రావు,గోడె నరసింహ చారి మరియు తెలుగు దేశం కార్యకర్తలు పాల్గొన్నారు.