శ్రీ శుభ బలరాం చారిటబుల్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
భీమిలి:విశాఖ లోకల్ న్యూస్
భీమిలి నియోజకవర్గం,ఆనందపురం మండలం లో వెల్లంకి గ్రామం లో శ్రీ శుభ బలరాం చారిటబుల్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేసిన బిజేపి కిసాన్ మోర్చ ఉత్తరాంధ్ర జోనల్ ఇన్చార్జ్ పాకలపాటి రవి రాజు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,శ్రీ శుభ బలరాం చారిటబుల్ సేవా ట్రస్ట్ చైర్మన్ పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా, ఆయన సొంత నిధులతో,భీమిలి నియోజకవర్గం లో అనేక సేవ కార్యక్రమలు చేస్తున్నారు,ప్రతి సంవత్సరం వలే,ఈ సంవత్సరం కూడా పర్యావరణ పరిరక్షణ కోసం, గ్రామాల్లో ప్రజలు మట్టి విగ్రహాలు పూజించాలని నినాదంతో మట్టి విగ్రహాల పంపిణీ చేస్తున్నారని, పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్ గారి నీ అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు.ఈ సందర్భంగా శ్రీ శుభ బలరాం చారిటబుల్ సేవా ట్రస్ట్ చైర్మన్ పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్ మాట్లాడుతూ,ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా మా ట్రస్టు తరపున,మా గ్రామ తో పాటు,మండలo లో అనేక గ్రామాల్లో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది.మట్టి గణపతిని పూజ చేద్దాం,పర్యావర ణన్ని కాపాడుదాం.అనే నినాదంతో ప్రజలందరు మట్టి వినాయక విగ్రహాలు పూజించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు బిజేపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఉప్పాడ అప్పారావు, రాష్ట్ర బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెంబర్ కోరాడ శoకరావు, బిజేపి జిల్లా మహిళా మోర్చ ఉపాధ్యక్షురాలు యేలూరి ధర్మవతి బిజెపి మండల పార్టీ అధ్యక్షులు మీసాల రాము నాయుడు,జిల్లా ఓ.బి.సి. కార్యదర్శి,పంపాన శ్రీధర్ బిజేపి నాయకులు బోర శ్రీను,సాయి రమేష్,ఇంటి సత్తి రాజు, కాశీ,కె.వి.వి. సూర్య నారాయణ, దుక్క అప్పల సూరి, తదితరులు పాల్గొన్నారు.